కొందరికి మంచి ఉద్యోగం, జీతం ఉన్న కూడా సంతృప్తి ఉండదు. సాధారణంగా ఉద్యోగులు ఉద్యోగాన్ని వదిలివేయాలని నిర్ణయించుకోవడం చాలా అరుదు. కానీ రాండ్‌స్టాడ్ ఇండియా వర్క్‌మానిటర్ 2025 సర్వే రిపోర్ట్స్ మాత్రం ఇలాంటిదే సూచిస్తున్నాయి. ఈ సర్వే ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ సర్వే భారతీయ ఉద్యోగుల మారుతున్న ప్రాధాన్యతలను వెలుగులోకి తెస్తుంది. సర్వే ప్రకారం, 52% మంది ఉద్యోగులు పని చేయడానికి వెసులుబాటు ఇవ్వని ఉద్యోగాలను వదలిలేయడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలిపింది.
మీకు మేనేజర్‌తో మంచి సంబంధం లేకపోతే...
ఈ రిపోర్ట్లో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. 60% ఉద్యోగులు మేనేజర్‌తో మంచి సంబంధం లేకపోతే ఉద్యోగాన్ని వదిలి వెళ్లాలని కోరుకుంటున్నారు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పని ప్రదేశాల వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. ఉద్యోగులు ఇప్పుడు తమకు అనుకూలమైన, సమానత్వాన్ని అందించే అలాగే ఫ్యూచర్ రెడీగా ఉన్న ప్రదేశంలో పనిచేయాలనుకుంటున్నారు. భారతదేశంలో కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది. రాండ్‌స్టాడ్ వర్క్‌మానిటర్ సర్వే 22 సంవత్సరాలుగా నడుస్తోంది.

పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రభావం, మారుతున్న సామాజిక విలువలు, ఉద్దేశపూర్వక పనిపై ప్రాధాన్యత భారతదేశంలోని ఉద్యోగుల మనస్తత్వాన్ని ఎలా మారుస్తున్నాయో ఈ సర్వే చూపిస్తుంది. ఈ సంవత్సరం సర్వే ఫలితాల ప్రకారం ఉద్యోగాల కోసం చూస్తున్న వారి సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఈ సంఖ్య 57% నుండి 59%కి చేరింది. కానీ, ఉద్యోగుల ప్రాధాన్యతలలో పెద్ద మార్పు వచ్చింది. గతంలో జీతం అత్యంత ముఖ్యమైన విషయం. ఉద్యోగంలో అనుకూలత, నేర్చుకోవడం అండ్ అభివృద్ధి చెందే అవకాశాలు ఇప్పుడు చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయి.
జీతం కోసం పని
ఉద్యోగులు ఇకపై కేవలం జీతం కోసమే పనిచేయాలని కోరుకోవడంలేదని సర్వే చూపిస్తుంది. వీరు సొంత విలువలు, జీవిత లక్ష్యాలకు అనుగుణంగా ఉండే ఉద్యోగం కోరుకుంటున్నారు. ఉద్యోగ భద్రత, మానసిక ఆరోగ్య సంరక్షణ, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఇప్పుడు చాలా ముఖ్యమైనవిగా మారాయి. జీతం ప్రాముఖ్యత ఇప్పుడు నాల్గవ స్థానానికి చేరుకుంది. ఇది ప్రజలు ఇకపై ఉద్యోగాన్ని కేవలం సంపాదనగా పరిగణించడం లేదని చూపిస్తుంది.
పని ప్రదేశంతో పరిచయం
దాదాపు 69% మంది భారతీయ ఉద్యోగులు ఆఫీసుకి చెందినవారనే భావనతో ఉండాలని కోరుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 55%. ఈ మార్పు ప్రజలు ఇప్పుడు అందరికీ సమానత్వం లభించే పని సంస్కృతిని కోరుకుంటున్నారని చూపిస్తుంది. లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఎల్ అండ్ డి) అవకాశాలు అందకపోతే 67% మంది ఉద్యోగులు వాల్ల ఉద్యోగాన్ని వదిలివేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 41%. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య కేవలం 23% మాత్రమే ఉండగా, 43% మంది భారతీయ ఉద్యోగులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శిక్షణను అత్యంత ముఖ్యమైన L&D అవకాశంగా భావిస్తున్నారు.
సౌకర్యవంతమైన పని గంటలు అవసరం
భారతదేశంలోని అన్ని తరాల ప్రజలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ సౌకర్యవంతమైన పని గంటలను కోరుకుంటున్నారు. భారతదేశంలోని ప్రత్యేకమైన సామాజిక-ఆర్థిక, పని ప్రదేశాల పరిస్థితులే దీనికి కారణం. సుదీర్ఘ ప్రయాణాలు, కుటుంబ బాధ్యతలు, తీవ్రమైన ఉద్యోగ పోటీ ఉన్న సమయంలో ఉద్యోగాలను ప్రారంభిస్తున్నందున, సౌకర్యవంతమైన పని గంటలను కోరుకుంటున్నారు. పని, వ్యక్తిగత జీవితం మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవడం చాలా ముఖ్యం. 70% మంది ఉద్యోగులు తమ విలువలకు సరిపోని కంపెనీలో పనిచేయబోమని అంటున్నారు.


Click it and Unblock the Notifications