Global Leader: పాపులర్ గ్లోబల్ లీడర్‌గా ప్రధాని మోదీ.. అమెరికా, కెనడా, UK అధినేతలకు గట్టి షాక్
Global Leader: G20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన భారత్ పై.. ప్రపంచంతో పాటు శత్రు దేశాలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నాయి. భారత నాయకత్వ పటిమను పలు దేశాధినేతలు సహా అంతర్జాతీయ మీడియా సైతం గుర్తించింది. గ్లోబల్ లీడర్ గా ప్రధాని నరేంద్ర మోదీ పేరు మారు మోగిపోతోంది. అగ్రరాజ్యం సైతం నమో మోదీ అంటూ మన ప్రధాని పాలనా దక్షతకు, విదేశాంగ విధానానికి తలచుతోంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన సత్తా చాటారు. G20 సమావేశం అనంతరం 'మార్నింగ్ కన్సల్ట్' సంస్థ నిర్వహించిన సర్వేలో అగ్రస్థానం దక్కించుకున్నారు. 'గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్' పేరిట జరిగిన ఈ సర్వేలో.. 76 శాతం మంది ప్రజలు మోడీ లీడర్షిప్ ను కొనియాడారు. 18 శాతం మంది వ్యతిరేకంగా ఓటేయగా.. మరో 6 శాతం మంది తటస్థంగా ఉన్నట్లు సర్వే నివేదిక పేర్కొంది.

దీంతో అంతర్జాతీయ దేశాధినేతలతో పోలిస్తే నరేంద్ర మోదీ టాప్ లీడర్గా కొనసాగుతున్నారు. గతంలోనూ ఈ ర్యాంకింగ్స్ లో మన ప్రధాని అగ్రస్థానంలో నిలిచారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షులు జో బైడెన్, కెనడా PM జస్టిన్ ట్రూడో, UK PM రిషీ సునాక్ వంటి దేశాధినేతలతో పోలిస్తే.. స్విట్జర్లాండ్ మరియు మెక్సికో ప్రెసిడెంట్స్ మెరుగైన ర్యాంకింగ్స్ సాధించడం విశేషం.
ఇటీవల ముగిసిన G20 సమావేశాల్లో ఆయా దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ ను ముక్తకంఠంతో ఆమోదించాయి. తద్వారా సభ్యదేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత భారత్ సొంతమైంది. 'వన్ ఎర్త్.. వన్ ఫ్యామిలీ.. వన్ ఫ్యూచర్' నినాదంతో వసుదైక కుటుంబంగా కలిసి నడుద్దామని ప్రపంచ దేశాలకు భారత్ ఇచ్చిన పిలుపు.. యావత్ మానవజాతిని ఆలోచింపజేసింది అనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications