IPO News: ఆశలు సర్వ నాశనం చేసిన ఐపీవో.. తొలిరోజు నష్టాల్లో లిస్టింగ్..
Suraj Estate IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి మెుత్తం 3 ఐపీవోలు నేడు జాబితా చేయబడ్డాయి. ఈ క్రమంలో కేవలం ఒక్కటి మాత్రమే ఇన్వెస్టర్లకు అదృష్టాన్ని తెచ్చిపెట్టగా.. మిగిలిన రెండు మాత్రం నిరాశకు గురిచేశాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతోంది ఇన్వెస్టర్ల ఆశలను ఆవిరి చేసిన సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఐపీవో గురించే. అనేక ఆశలతో ఇన్వెస్టర్లు కంపెనీ షేర్ల జాబితా కోసం ఎదురుచూసినప్పటికీ చివరికి వారికి నిరాశే మిగిలింది. దీంతో రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ షేర్లు తొలిరోజే మార్కెట్‌లో కుదేలయ్యాయి. కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో 5.5% తగ్గింపుతో రూ.340 వద్ద నిరాశాజనకమైన లిస్టింగ్ నమోదు చేసింది. ఇక్ బీఎస్ఈలో స్టాక్ 4.5 శాతం తగ్గింపుతో రూ.343.80 రేటు వద్ద జాబితా చేయబడింది.

వాస్తవానికి ఐపీవో కోసం కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.340-380గా ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా గరిష్ఠ బ్యాండ్ ధర వద్ద కంపెనీ షేర్లను ఇష్యూ చేసింది. నేడు మార్కెట్లో ఐపీవో బలహీనమైన లిస్టింగ్ తర్వాత సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ షేర్లు స్వల్పంగా కోలుకున్నాయి. కంపెనీ షేర్లు దాదాపు 1.5 శాతం వృద్ధితో రూ.345.50 వద్ద ట్రేడవుతున్నాయి. వాస్తవానికి ఈ ఐపీవో ద్వారా కంపెనీ ఏకంగా రూ.400 కోట్లను సమీకరించింది. ఇందుకోసం రిటైలర్లకు ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 18న ప్రారంభించబడి డిసెంబర్ 20న ముగిసింది.
సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఐపీవో మెుత్తంగా 16.57 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. కంపెనీ ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 9.85 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 20.02 రెట్లు, సంస్థాగత కొనుగోలుదారుల కోటా 25.74 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఇందులో పాల్గొనటం కోసం ఇన్వెస్టర్లు కనీసం పెట్టుబడిగా రూ.14,760 వెచ్చించారు. ఐపీవోకి ముందర ప్రమోటర్ల వాటా కంపెనీలో 100 శాతం ఉండగా ప్రస్తుతం 74.9 శాతానికి పడిపోయింది.


Click it and Unblock the Notifications