IPO News: ఇష్యూ రేటు ప్రకటించిన రెండు ఐపీవోలు.. సూపర్ చాన్స్ బాస్.. డోన్ట్ మిస్..
IPO Price Band: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఎక్కువగా డిసెంబర్ మాసంలోనే ఐపీవోల ప్రవేశం కొనసాగుతోంది. పైగా ఎక్కువ సంఖ్యలో మెయిన్ కేటగిరీలోని పెద్ద ఐపీవోలు అరంగేట్రం చేస్తున్నాయి.
ఈ క్రమంలో ముందుగా ముతూట్ మైక్రోఫిన్ కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ప్రకటించింది. వాస్తవానికి ఈ ఐపీవో డిసెంబర్ 18న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతోంది. కేరళలోని కొచ్చి ఆధారిత కంపెనీ తన ప్రైస్ బ్యాండ్ ధరను రూ.277-291గా ప్రకటించింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.960 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ 20న ముగియనున్న ఐపీవో రూ.760 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూను కలిగి ఉండగా.. మిగిలిన రూ.200 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించబడుతున్నాయి.

ఓఎఫ్ఎస్‌లో రూ.150 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు థామస్ జాన్ ముత్తూట్, థామస్ ముత్తూట్, థామస్ జార్జ్ ముత్తూట్, ప్రీతి జాన్ ముత్తూట్, రెమ్మీ థామస్, నీనా జార్జ్ విక్రయిస్తారు. మిగిలిన మెుత్తాన్ని గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ WIV విక్రయిస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ తన ఉద్యోగులకు రూ.10 కోట్లు విలువైన షేర్లను ఐపీవోలో ఒక్కోటి రూ.14 తగ్గింపుతో రిజర్వు చేసి ఉంచింది. లాట్ పరిమాణం 51 షేర్లుగా ఉండగా ఇందుకు కనీసం రూ.14,841 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.

ఇదే క్రమంలో డిసెంబర్ 18న ప్రారంభమౌతున్న మరో ఐపీవో సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ కంపెనీ నుంచి వస్తోంది. తాజా ఐపీవో నుంచి కంపెనీ రూ.400 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇదుకోసం నేడు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.340-360గా ప్రకటించింది. ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ రూ.285 కోట్ల అప్పులను తిరిగి చెల్లించేందుకు దీనిలో సొమ్మును వినియోగించనుంది. సెప్టెంబరు 2023 నాటికి కంపెనీ మొత్తం బకాయి ఉన్న ఏకీకృత రుణం రూ.568.83 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications