Adani-Hindenburg: అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందంటూ వరుసగా విదేశీ సంస్థలు చేసిన ఆరోపణలు మార్కెట్లోని ఇన్వెస్టర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో అదానీ-హిండెన్‌బర్గ్ విషయంలో SEBI దాఖలు చేసిన తాజా స్థితి నివేదికను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 15న పరిశీలించనుంది.
CJI DY చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సెప్టెంబర్ 15న పిటిషన్లను విచారణకు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో దర్యాప్తు ఫలితాల ఆధారంగా సెబీ తగిన చర్యలు తీసుకుంటుందని, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా 24 అంశాలను పరిశీలించింది. అయితే బయటి ఏజెన్సీలు లేదా సంస్థల నుంచి రావాల్సిన సమాచారం కోసం సెబీ వేచి ఉంది.

ఆగస్టు 14న సెబీ విచారణ ప్రక్రియను ముగించి, ఈ విషయంలో స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయడానికి 15 రోజుల పొడిగింపును కోరింది. అంతకుముందు అదానీ-హిండెన్‌బర్గ్ కేసుకు సంబంధించి కోర్టు నియమించిన నిపుణుల కమిటీ చేసిన వివిధ సిఫార్సులపై సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ముందు తన అభిప్రాయాలను దాఖలు చేసింది. కొంత గడువులో దర్యాప్తును పూర్తి చేయాలనుకోవటం వల్ల దర్యాప్తు నాణ్యతను రాజీ చేస్తుందని సెబీ వెల్లడించింది.
అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు తన షేర్ల ధరలను తారుమారు చేసిందని హిండెన్ బర్గ్ సంస్థ ఆరోపించింది. సెబీ రూపొందించిన నిబంధనలకు విరుద్ధంగా సంబంధిత పార్టీలతో లావాదేవీలు, సంబంధిత పార్టీలకు సంబంధించిన ఇతర సమాచారాన్ని బహిర్గతం చేయడంలో విఫలమైందని పేర్కొంది.
సెక్యూరిటీ చట్టాలలోని ఇతర నిబంధనలను ఉల్లంఘించారని.. భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ సొంత కంపెనీల షేర్ల ధరలను పెంచేందుకు అక్రమ మార్గాలను వినియోగించినట్లు ఆరోపించింది. దీంతో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ ఏకంగా 100 బిలియన్ డాలర్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది.


Click it and Unblock the Notifications