న్యూఢిల్లీ: లోన్ మారటోరియంకు సంబంధించిన అంశంలో కేంద్రప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ ఇచ్చిన వెసులుబాటు లోన్ మారటోరియం కాలానికి వడ్డీని మాఫీ చేయవచ్చా లేదా మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేయవచ్చా అనే అంశంపై కేంద్రం నిర్ణీత సమయంలో సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు
దీనిని వ్యాపార కోణంలో మాత్రమే ఆలోచించవద్దని, ప్రజల బాధను కూడా పట్టించుకోవాలని సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ సమస్య కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల కలిగిందని పేర్కొంది. యూనియన్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వెనుక ఉన్నట్లుగా కనిపిస్తోందని అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. దీనిని బిజినెస్‌గా మాత్రమే ఆలోచించవద్దని, రిలీఫ్ అవసరమని పేర్కొంది. కరోనా-లాక్ డౌన్ నేపథ్యంలో లోన్ మారటోరియాన్ని కేవలం బిజినెస్ కోణంలోనే ఆలోచించడం సరికాదని ప్రజల ఇబ్బందులు పరిగణలోకి తీసుకోవాలన్నారు.

డీఎంఏ కింద కేంద్రం అలా చేయవచ్చు
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్(DMA) కింద లోన్ మారటోరియం అంశంపై కేంద్రానికి అధికారాలు ఉన్నాయని ఉన్నతన్యాయస్థానం గుర్తు చేసింది. ఈ బెంచ్‌లో జస్టిస్ అశోక్ భూషణ్, సంజయ్ కిషన్, ఎంఆర్ షా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేసిన ఈఎంఐలపై వడ్డీని వసూలు చేయడాన్ని ఆపివేయడం లేదా మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీని వసూలు చేయడం వంటి వివిధ అంశాలపై నిర్ణయం తీసుకొని బ్యాంకులను ఆదేశించడానికి కేంద్రానికి అధికారాలు ఉన్నాయని తెలిపింది.

వారం రోజుల్లో చెప్పండి.. కేంద్రానికి సుప్రీం
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ కేంద్రం, ఆర్బీఐ ఈ అంశంపై కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. కేంద్రం తప్పించుకోవడం లేదని అత్యున్నతన్యాయస్థానం ముందు ఉంచారు. అదే సమయంలో లోన్ మారటోరియంపై వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం కేసును సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. లోన్ మారటోరియానికి సంబంధించి కేంద్రం, ఆర్బీఐ తన అభిప్రాయాన్ని వెల్లడించాలని జూన్ నెలలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వడ్డీపై వడ్డీపై ఆక్షేపణ
కరోనా రుణాలుపై మారిటోరియం విధించినా వడ్డీలపై వడ్డీలను వసూలు చేయడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. వడ్డీ మాఫీ చేయవచ్చా లేదా తాత్కాలిక నిషేధ సమయంలో వచ్చే వడ్డీపై వడ్డీని వసూలు చేయడాన్ని ఆపివేయవచ్చా అనేది నిర్ణయించుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications