టెల్కోలకు 20 ఏళ్ల గడువుపై సుప్రీంకోర్టు డౌట్స్, రూ.4 లక్షల కోట్లు అడగడమా?

టెల్కోల బకాయిలపై సుప్రీం కోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. నాన్-టెలికం సేవల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థ (PSU)ల నుండి సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (AGR) బకాయిల కింద రూ.4 లక్షల కోట్ల వసూలుకు నోటీసులు జారీ చేసే అధికారం ఎవరిచ్చారని టెలికం శాఖ డాట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పెక్ట్రం కేటాయింపులు ఉన్నంత మాత్రాన ఆ కంపెనీల నుండి ఏజీఆర్ వసూలు చేసేందుకు నోటీసులు జారీ చేయడమేనా అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

రూ.4 లక్షల కోట్ల వసూలుకు బ్రేక్

రూ.4 లక్షల కోట్ల వసూలుకు బ్రేక్

టెలికమేతర PSUలైన గెయిల్ వంటి వాటి నుండి రూ.4 లక్షల కోట్ల బకాయిలు కోరే అంశాన్ని పునఃపరిశీలించాలని డాట్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టెలికం కంపెనీల బకాయిలపై సుప్రీం వెలువరిచిన తీర్పు ఆధారంగా అలా చేయడం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం పేర్కొంది. దీంతో గెయిల్, పవర్ గ్రిడ్, ఢిల్లీ మెట్రో రైలు వంటి నాన్-టెలికం PSUల నుండి రూ.4 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయిలు వసూలు చేయాలన్న డాట్ నిర్ణయానికి బ్రేక్ పడింది. పీఎస్‌యూలపై చేసిన విజ్ఞప్తిని వెనక్కి తీసుకోకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. తదుపరి విచారణను జూన్ 18వ తేదీకి వాయిదా వేసింది. కాగా, గెయిల్ ఇండియా రూ.1.72 లక్షల కోట్లు, ఆయిల్ ఇండియా రూ.48,489.26 కోట్లు, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా రూ.22,062.65 కోట్లు, గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ రూ.15,019.97 కోట్లు, డీఎంఆర్సీ రూ.5,481.52 కోట్లు చెల్లించాలని డాట్ (DoT) డిమాండ్ చేస్తోంది.

సమయం ఎందుకో చెప్పండి

సమయం ఎందుకో చెప్పండి

అదే సమయంలో భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్, ఇతర టెలికం కంపెనీలు బకాయిల చెల్లింపుకు సమయం కోరాయి. బకాయిల చెల్లింపుల్లో మిగిలిన మొత్తానికి సమయం ఎందుకు అవసరమో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు కోరింది. టెలికం కంపెనీలు చెల్లింపులను ఎంత గడువులోగా చెల్లించాలో ఎలాంటి హామీలు కావాలో చెప్పాలని అడిగింది.

3

20 ఏళ్లా.. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు

20 ఏళ్లా.. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు

ప్రయివేటు టెల్కోలు రూ.1.69 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లించేందుకు 20 సంవత్సరాల గడువు ఇవ్వడంపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కంపెనీల ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఒకేసారి ఈ మొత్తం చెల్లించాలని ఒత్తిడి చేస్తే కంపెనీలు దివాలా తీసే ప్రమాదం ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పగా, ధర్మాసనం ఈ వాదనను తోసిపుచ్చింది. ఇంత గడువు ఇస్తే బకాయిలు చెల్లిస్తాయని గ్యారెంటీ ఏమిటి అని ప్రశ్నించింది. కంపెనీ డైరెక్టర్లు పూచీకత్తు ఇస్తారా అని అడిగింది. ఇరవై ఏళ్లలో ఏం జరుగుతుందో ఏం తెలుసు అని ప్రశ్నించింది.

స్పెక్ట్రం హామీ కాదు

స్పెక్ట్రం హామీ కాదు

ఏజీఆర్ బకాయిల కింద ఇప్పటికిప్పుడు రూ.50,000 కోట్లు, వడ్డీ, పెనాల్టీ చెల్లింపులకు హామీ ఇచ్చే పరిస్థితి లేదని వొడాఫోన్ ఐడియా తెలిపింది. తమ కంపెనీకి ఉన్న స్పెక్టమ్ కేటాయింపులనే హామీగా పరిగణించాలని కోరారు. దీనిని ధర్మాసనం తోసిపుచ్చింది. డైరెక్టర్ల వ్యక్తిగత ఆస్తులను లేదా ఇతర ఆస్తులు చూపించాలని సూచించింది. స్పెక్ట్రంను హామీగా పరిగణించలేమని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+