Baba Ramdev: గత వాయిదాలో బాబా రామ్‌దేవ్, కంపెనీ సీఈవో బాలకృష్ణలు కోర్టు ముందు తప్పక కావాల్సిందేనని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. నేడు పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్‌పై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
పతాంజలి కంపెనీ "తప్పుదోవ పట్టించే" ప్రకటనలపై అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన హామీని తీవ్రంగా ఉల్లంఘించిందని పేర్కొంది. ఈ క్రమంలో ధర్మాసనం గత తీర్పుకు అనుగుణంగా.. పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణతో కలిసి బాబా రామ్‌దేవ్ నేడు స్వయంగా కోర్టులో హాజరయ్యారు. కోర్టుకు తాను బేషరతుగా క్షమాపణలు చెప్పడాన్ని గమనించాలని కోర్టును కోరారు. షోకాజ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వీరిద్దరూ కోర్టుకు హాజరయ్యారు.

నవంబర్ 21, 2023న మీడియాకు తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వవద్దని లేదా "ఔషధ ప్రభావాన్ని క్లెయిమ్ చేసే లేదా ఏదైనా ఔషధ వ్యవస్థకు వ్యతిరేకంగా సాధారణ ప్రకటనలు" చేయవద్దని కోర్టు కంపెనీని కోరింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఒక ప్రకటనతో బయటకు వచ్చి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినందుకు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ కోర్టు కంపెనీకి, బాలకృష్ణకు నోటీసు జారీ చేసింది. మార్చి 19న, ఫిబ్రవరి 27 నోటీసుకు ఎలాంటి సమాధానం దాఖలు చేయలేదని బెంచ్ గుర్తించి. దీంతో అత్యున్నత న్యాయస్థానం బాబా రామ్‌దేవ్‌కు నోటీసు జారీ చేయాలని నిర్ణయించింది.
బాబా రామ్‌దేవ్ హాజరుపై కోర్టు కీలక కామెంట్స్ చేస్తూ.. "ఇది సంపూర్ణ ధిక్కరణ. సుప్రీంకోర్టు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులు ఇచ్చే ప్రతి ఉత్తర్వును గౌరవించాలి' అని ధర్మాసనం పేర్కొంది. "మీరు కోర్టుకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి, మీరు ప్రతి అడ్డంకిని అధిగమించారు" అని కోర్టు పతంజలి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో కరోనా మహమ్మారికి అల్లోపతిలో నివారణ లేదని పతంజలి చెబుతున్నప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఎందుకు కళ్లు మూసుకుందని కోర్టు కేంద్రాన్ని నిలదీసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకున్నట్లు కనిపించడం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందని జస్టిస్ హిమ కోహ్లీ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో వారంలోగా తమ అఫిడవిట్‌లను దాఖలు చేసేందుకు రామ్‌దేవ్, బాలకృష్ణలకు కోర్టు చివరి అవకాశం ఇచ్చింది. ఈ వ్యాజ్యాన్ని తదుపరి విచారణకు ఏప్రిల్ 10న పోస్ట్ చేస్తూ.. తర్వాతి తేదీన కూడా విచారణకు రామ్‌దేవ్, బాలకృష్ణ తమ ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications