Banking News: బ్యాంక్ ఉద్యోగులకు సుప్రీం కోర్టు షాక్..! వాటిపై టాక్స్ కట్టాల్సిందే..
Tax News: దేశంలో బ్యాంకింగ్ రంగంలో లక్షలాధి మంది ఉపాధి పొందుతున్నారు. వీరికి బ్యాంకులు వేతనాలతో పాటు కొన్ని ప్రత్యేక సదుపాయాలను అందిస్తాయని మనందరికీ తెలిసిందే. అయితే వీరికి ప్రస్తుతం సుప్రీం కోర్టు తాజా తీర్పు షాక్ కలిగించింది.
సుప్రీం కోర్టు తాజా రూలింగ్ ప్రకారం బ్యాంకులు తమ ఉద్యోగులకు అందించే వడ్డీ రహిత రుణాలు లేదా తక్కువ రేటుకు అందించే లోన్స్ ఫ్రింజ్ బెనిఫిట్స్ లేదా ఎమినిటీస్ కిందకు వస్తాయని పేర్కొంది. అందువల్ల ఇవి పన్ను పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఆదాయపు పన్ను శాఖ నియమాన్ని సమర్థించింది. బ్యాంక్ ఉద్యోగులు అనుభవిస్తున్న ఈ ప్రయోజనాలు వారికి "ప్రత్యేకమైనవి", 'పర్క్విసిట్' స్వభావం కలిగి ఉన్నందున తప్పకుండా వాటిపై పన్ను విధించాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది.

ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 17(2)(viii), ఆదాయపు పన్ను రూల్స్ 1962లోని రూల్ 3(7)(i)ని రాజ్యాంగబద్ధత ఆధారంగా వివిధ బ్యాంకుల సిబ్బంది సంఘాలు & అధికారుల సంఘాలు సవాలు చేశాయి. రూల్ 3(7)(i) ఏకపక్షంగా ఉందని, రుణంపై కస్టమర్‌కు బ్యాంకు వసూలు చేసే వాస్తవ వడ్డీ రేటుకు బదులుగా SBI ప్రధాన రుణ రేటును బెంచ్‌మార్క్‌గా ఉపయోగించడం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించిందని వారు వాదించారు. SBI వడ్డీ రేటును బెంచ్‌మార్క్‌గా ఉపయోగించడం ఏకపక్ష లేదా అసమాన అధికార వినియోగం కాదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
"వాణిజ్య & పన్ను చట్టాలు చాలా సున్నితంగా, సంక్లిష్టంగా ఉంటాయి. అవి అనేక సమస్యలతో వ్యవహరిస్తాయి & ఆకస్మికంగా ఉంటాయి. ఈ న్యాయస్థానం సందేహాస్పద చట్టంలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడదు, ఇది దుర్వినియోగ అవకాశాలను నిరోధిస్తుంది. నిశ్చయతను ప్రోత్సహిస్తుంది" అని బెంచ్ పేర్కొంది.


Click it and Unblock the Notifications