బ్యాంకులకు సుప్రీంలో ఎదురుదెబ్బ.. రుణగ్రహీతలకు ఆ హక్కు ఉంటుందంటూ తీర్పు..
బ్యాంకులు ఏదైనా ఖాతాను మోసపూరితమైనదిగా వర్గీకరించటానికి ముందు రుణగ్రహీతకు తన వాదనలు వినిపించే హక్కు ఉందని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ విషయంలో సహజ న్యాయ సూత్రాలను బ్యాంకులు తప్పక పాటించాలని.. మోసానికి సంబంధించి ఇప్పటిరే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్ చదవాలను ఈ సందర్భంగా పేర్కొంది.
బ్యాంకులు ఎవరి ఖాతానైనా fraudగా వర్గీకరించినట్లయితే.. అది వారిపై క్రిమినల్ చర్యలకు దారితీస్తుందని తద్వారా ఆ రుణగ్రహీత ఎక్కడా లోన్స్ పొందేందుకు వీలులేకుండా "బ్లాక్‌లిస్ట్" కావటానికి దారితీస్తుందని కోర్టు పేర్కొంది. అందువల్ల రుణగ్రహీతలకు ప్రధాన ఆదేశాల ప్రకారం విచారణ అవకాశం ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. అయితే నమోదు చేయడానికి ముందు అవకాశం ఇవ్వవలసిన అవసరం లేదన్న కోర్టు.. అకౌంటును మోసపూరితమైనదిగా వర్గీకరించడానికి, ఏకపక్షంగా వ్యవహరించకుండా ఉండేందుకు బ్యాంకులు తమ నిర్ణయంపై సహేతుకమైన ఉత్తర్వును తప్పనిసరిగా జారీ చేయాలని తన తీర్పులో పేర్కొంది.

బ్యాంకింగ్ రెగ్యులేటరా RBI దీనికి సంబంధించి 2016లో ఒక మాస్టర్ సర్క్యులర్ జారీ చేసింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల ఖాతాలను మోసపూరితమైనదిగా ఏకపక్షంగా వర్గీకరించడానికి బ్యాంకులను అనుమతించటంతో.. దీనిని వివిధ హైకోర్టుల్లో సవాలు చేశారు. అయితే 2021లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పుపై సుప్రీంకు అప్పీలుకు వెళ్లగా తాజా చర్య వచ్చింది. బ్యాంకింగ్ రంగంలో మోసాలను గుర్తించేందుకు జారీ చేసిన రిజర్వు బ్యాంక్ సర్క్యులర్‌లోని క్లాజుల్లో సహజ న్యాయ సూత్రాలు ఉండేలా చూడాలని తెలంగాణ హైకోర్టు ఆర్‌బిఐని ఆదేశించింది.
సహజ న్యాయం అంటే..ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే ముందు వారికి తమ వాదన వినిపించే హక్కు ఉంటుంది. సబ్జెక్ట్‌పై నిర్ణయం తీసుకునే ముందు పిటిషనర్‌కు విచారణకు అవకాశం ఇవ్వాలని, మూడు నెలల్లోగా కసరత్తు పూర్తి చేయాలని, ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ కమిటీ తదుపరి కసరత్తు చేయాలని జాయింట్ లెండర్స్ ఫోరమ్ ని హైకోర్టు ఆదేశించింది. అయితే తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ఆర్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవాల్ చేసిన తరుణంలో తాజా తీర్పును సుప్రీం కోర్టు ఇచ్చింది.


Click it and Unblock the Notifications