Adani Case: అదానీ కేసులో సెబీకి సుప్రీం కోర్టు ప్రశ్నలు.. ఏమందంటే..??
Adani-Hindenburg: ఈ ఏడాది జనవరిలో అదానీ కంపెనీ వ్యాపారాలపై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణల కుంపటి రగులుతూనే ఉంది. ప్రస్తుతం ఇది ధర్మాసనం ముందుకు చేరుకుంది.
అదానీ గ్రూప్‌పై స్టాక్ మానిప్యులేషన్ మరియు అకౌంటింగ్ ఫ్రాడ్ ఆరోపణలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిల్‌లను సుప్రీంకోర్టు విచారించింది. ప్రస్తుతం దీని విచారణ సుప్రీం కోర్టు నేతృత్వంలో జరుగుతోంది. ఈ క్రమంలో అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో విచారణను పూర్తి చేసేందుకు ఇకపై పొడిగింపును కోరబోమని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ శుక్రవారం ఈ కేసును విచారిస్తూ.. పెట్టుబడిదారుల విలువపై మార్కెట్ రెగ్యులేటర్ ఏమి చేస్తోందంటూ ప్రశ్నించారు. వారి రక్షణకు భరోసా ఇస్తున్నారా అంటూ సెబీని అడిగారు. స్టాక్ మార్కెట్‌లో తీవ్ర అస్థిరత ఉందని.. ఇన్వెస్టర్లకు ధృక్కోణంలో ఈ రకమైన ఒడిదుడుకుల కోసం సెబీ ఏమి ప్లాన్ చేస్తోందని సెబీని ధర్మాసనం ప్రశ్నించింది.
రెగ్యులేటరీ మెకానిజమ్‌ను బలోపేతం చేసేందుకు నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలనలో ఉన్నాయని, సూత్రప్రాయంగా సెబీ సిఫార్సును ఆమోదించినట్లు సెబీ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. సమ్మేళనంపై 24 'కేసులను'గుర్తించామని.. వాటిలో 22 కేసుల దర్యాప్తును ముగించామని మార్కెట్ రెగ్యులేటర్ తెలిపింది. మిగిలిన రెండింటి విషయంలో విదేశీ నియంత్రణ సంస్థల నుండి ప్రతిస్పందన కోసం వేచిఉన్నట్లు పేర్కొంది.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) భవిష్యత్తులో ఈ షార్ట్ సెల్లింగ్ సందర్భాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. సెబీ మొత్తం 24 కేసుల్లో విచారణను పూర్తి చేసి, నిపుణుల కమిటీ సిఫార్సులతో చట్ట ప్రకారం కొనసాగాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ క్రమంలో సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్ నివేదికలోని ఆరోపణలను నిజమని తాము అంగీకరించాల్సిన అవసరం లేదని అన్నారు. అవి తమ ముందు లేవని.. అందుకే దానిని పరిశీలించమని సెబీని కోరినట్లు ధర్మాసనం పేర్కొంది. వార్తాపత్రికలో ప్రచురితమైన దానిని సత్యంగా పరిగణించమని చట్టబద్ధమైన సంస్థను అడగలేమని CJI చెప్పారు. OCCRP నివేదిక ప్రకారం.. సెబీని అనుమానించడానికి తమ ముందు ఎటువంటి మెటీరియల్ లేదంటూ వినోద్ అదానీతో చాలా సంస్థలు ముడిపడి ఉన్నాయన్న అరోపణలపై సీజేఐ బదులిచ్చారు.


Click it and Unblock the Notifications