Adani-Hindenburg: సుప్రీంలో అదానీ కేసు విచారణ వాయిదా.. వాటి కోసం వేచి ఉన్న సెబీ..
Adani-Hindenburg: ఈ ఏడాది జనవరి నెలలో అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ విచారణ చేస్తోంది. ఇందులో అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, మోసపూరిత లావాదేవీలు, ఇతర అంశాలను ఎత్తి చూపింది. ఈ విచారణపై ఆగస్టు 25న సెబీ కోర్టుకు తన స్టేటస్ రిపోర్ట్ సమర్పించిన సంగతి తెలిసిందే.
అయితే మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ కు సంబంధించి అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన విచారణను కొనసాగిస్తోంది. తొలుత సుప్రీం ధర్మాసం ఆగస్టు 14లోపు దర్యాప్తు నివేదికను సమర్పించాలని కోరగా.. సెబీ అదుకు అదనంగా మరో 15 రోజుల పాటు గడువును కోరింది.

సెబీ నివేదికలోని అంశాలు ఇంతవరకు బహిరంగపరచబడలేదు. అయితే అదానీ గ్రూప్ కార్యకలాపాల్లోని వివిధ అంశాలకు సంబంధించి మొత్తం 24 పరిశోధనలను కలిగి ఉన్న విస్తృతమైన దర్యాప్తు పురోగతిపై సెబీ దర్యాప్తు పత్రం వెలుగునిస్తుందని వివిధ నివేదికలు తెలిపాయి. మెుత్తం 24 పరిశోధనల్లో 22 ఇప్పటికే వాటి ముగింపుకు చేరుకున్నాయి. ఫలితంగా తుది విచారణ నివేదికలు జారీ చేయబడ్డాయి.
సమ్మేళనంలో విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడం వెనుక ఉన్న అసలు యజమానులపై 5 టాక్స్ హెవెన్స్ నుంచి అందాల్సిన సమచారం కోసం వేచి ఉన్నట్లు సెబీ సుప్రీం కోర్టుకు తెలిపింది. విదేశీ రెగ్యులేటర్ల నుండి ముఖ్యమైన సమాచారాన్ని స్వీకరించడంపై మధ్యంతర నివేదికకు సంబంధించిన చర్య కొనసాగుతోంది. ఈ కీలకమైన విదేశీ డేటా అందుబాటులోకి వచ్చిన తర్వాత తన చర్యలను ఖరారు చేస్తామని సెబీ వెల్లడించింది. సెబీ దర్యాప్తు ప్రారంభ దశలో అదానీ సంస్థలకు సంబంధించిన 13 అంతర్జాతీయ సంస్థలపై దృష్టి సారించింది.


Click it and Unblock the Notifications