Supreme Court: బైక్ టాక్సీ కంపెనీలకు షాకిచ్చిన సుప్రీం.. అప్పటి వరకు నడపొద్దని ఆదేశం..!
బైక్ టాక్సీ అందించే సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఢిల్లీలో ఉబెర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సేవలను అనుమతిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఢిల్లీ ప్రభుత్వం కొత్త విధానం రూపొందించే వరకు టూ వీలర్స్ నడపొద్దని టైక్ టాక్సీ సేవలు అందించే సంస్థలకు స్పష్టం చేసింది.
ఈ సంవత్సరం ప్రారంభంలో ఢిల్లీ ప్రభుత్వం ఓ నోటీసు జారీ చేసింది. ఢిల్లీలో బైక్-టాక్సీలు నడపకాడదని స్పష్టం చేసింది. ఉల్లంఘనలకు అగ్రిగేటర్లు రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. వాణిజ్య అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగించడం మోటారు వాహనాల చట్టం 1988ని ఉల్లంఘించడమేనంటూ టూ వీలర్ ట్యాక్సీ సర్వీసులు అందించే సంస్థల్ని హెచ్చరించింది. ఆ సందర్భంలో నగర పాలక సంస్థ తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును కూడా రాపిడో సవాలు చేసింది.

ఇది వివిధ ప్రాథమిక, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తోందని, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వు జాతీయ రాజధాని ఢిల్లీలో బైక్-టాక్సీ అగ్రిగేటర్లు Rapido, Uber ఆపరేట్ చేయడానికి అనుమతించింది. కొత్త విధానాన్ని రూపొందించే వరకు వారిపై బలవంతపు చర్య తీసుకోవద్దని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని-ఆప్ ప్రభుత్వం మే 26న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వం నూతన పాలసీ తీసుకొచ్చే వరకు బైక్ టాక్సీలు నడపొద్దని ఆదేశించింది.


Click it and Unblock the Notifications