Patanjali: బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు షాక్.. షేర్ల పతనం..!
Patanjali News: దేశంలో ఆయుర్వేద ఉత్పత్తులు అనగానే చాలా మంది మదిలో మెదిలే చిత్రం పతంజలి. వాటిని బాబా రామ్‌దేవ్ తన చరిష్మాతో ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే ఈ కంపెనీ ఉత్పత్తుల అడ్వర్టైజ్మెంట్లు కంపెనీని పలు చిక్కుల్లోకి నెట్టాయి. దీంతో కంపెనీ షేర్లలో పెద్ద ప్రకంపన మెుదలైంది.
కోర్టు ధిక్కార నోటీసుపై స్పందించనందుకు ఆయుర్వేద కంపెనీ పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ, యోగా గురువు బాబా రామ్‌దేవ్ తదుపరి విచారణకు హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది. ఔషధ చికిత్సల గురించి తప్పుదారి పట్టించే యాడ్స్ ప్రచురించడం కొనసాగించినందుకు పతంజలి ఆయుర్వేద కంపెనీపై అత్యున్నత న్యాయస్థానం గతంలో ధిక్కార నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.

పతంజలి ఆయుర్వేద తన వివిధ ఉత్పత్తులను విక్రయించే క్రమంలో.. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలపై ధిక్కార విచారణలో షోకాజ్ నోటీసుపై స్పందించనందుకు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దీంతో వారిద్దరినీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనికి ముందు ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు పతంజలి ఆయుర్వేద ప్రకటనలను తప్పుదారి పట్టించిందని విమర్శించింది.
ఉత్పత్తులను నివారణగా ప్రకటించకుండా కోర్టు కంపెనీని నిషేధించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పతంజలి ఆయుర్వేద, దాని మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం సంచలనంగా మారింది. దీనికి ముందు సైతం అనేక మార్పు కంపెనీ యాడ్స్ విషయంలో సామాజిక కార్యకర్తలు తప్పులను ఎత్తి చూపారు.


Click it and Unblock the Notifications