Supreme Court: సంపాదన మూలం వద్దే పన్ను మినహాయించటాన్ని టీడీఎస్ అని అంటారు. ఇది సహజంగా చాలా మంది చెల్లింపులను పొందేటప్పుడు దీనిని చూసే ఉంటారు. దీనిని తర్వాత టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో తిరిగి పొందవచ్చు. అయితే ఒక కేసు విషయంలో సుప్రీం కోర్టు దీనిపై సంచలన తీర్పులను వెలువరించింది.
మూలం వద్ద మినహాయించే పన్ను(TDS) చెల్లింపులో కేవలం ఆలస్యం చేసినందుకు ఎటువంటి జరిమానా విధించబడదని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. ఆదాయపుపన్ను చట్టం ప్రకారం ఎవరైనా టాక్స్ పేయర్ మెుత్తం లేదా కొంత భాగం టాక్స్ డిడక్షన్ విషయంలో విఫలమైతే సదరు మెుత్తానికి సమానమైన మెుత్తాన్ని జరిమానాగా చెల్లించాలని చెబుతోంది. అయితే చెల్లింపులో విఫలమైనప్పుడు మాత్రమే జరిమానా విధించబడుతుందని చట్టం సూచిస్తోంది.

ఈ నిబంధనను వివరించిన సుప్రీం కోర్టు.. సదరు టాక్స్ పేయర్ టీడీఎస్ చెల్లించడంలో విఫలమైనప్పుడు మాత్రమే జరిమానా విధించవచ్చని.. చెల్లింపులో ఆలస్యం అయినప్పుడు కాదని స్పష్టం చేసింది. నిబంధన స్పష్టంగానే ఉందని, ఆ పదాలు టీడీఎస్ ఆలస్యంగా చెల్లింపుల గురించి మాట్లాడవని కోర్టు పేర్కొంది.
US Technologies International Pvt ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీ. ఈ కంపెనీ సేకరించిన TDSలో కొంత భాగాన్ని చెల్లించడంలో జాప్యం చేసింది. ఈ కారణంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్-271సి కింద రూ.1.10 కోట్లను జరిమానాను టాక్స్ అధికారులు విధించారు. పెనాల్టీగా విధించబడిన మొత్తం సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరంలో కంపెనీ సేకరించిన TDSకి సమానం. ఈ ఉత్తర్వులను 2009 కేరళ హైకోర్టు సమర్థించింది. దీంతో US టెక్నాలజీస్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేయటంతో తాజా తీర్పును వెలువరించింది.


Click it and Unblock the Notifications