Spicejet: స్పైస్ జెట్‌కు మరో ఎదురుదెబ్బ.. 3 రోజుల్లో బకాయిలు పే చేయకపోతే..
Spicejet: దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. స్విట్జర్లాండ్ కు చెందిన ప్రముఖ బ్యాంకు క్రెడిట్ స్విస్ కు మరో మూడు రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. అలా చేయడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
న్యాయస్థానం ఆదేశాల మేరకు క్రెడిట్ స్విస్ కు 1.5 మిలియన్ డాలర్లు చెల్లించనున్నట్లు స్పైస్ జెట్ తెలిపింది. అయితే సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికల అనతరం ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. స్పైస్ జెట్ చీఫ్ అజయ్ సింగ్ విచారణకు హాజరు కాగా.. 'ఈ దిల్లీ-డల్లీ వ్యాపారం చాలు. మీరు మరణించినా మేము బాధపడం' అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

ఈ విషయంపై కామెంట్ చేసేందుకు స్పైస్ జెట్ స్పందించలేదు. అయితే ఈ వివాదం 2015 నుంచి కొనసాగుతూ వస్తోంది. సుమారు 24 మిలియన్ డాలర్ల బకాయిలు చెల్లించాలని బ్యాంక్ క్లెయిమ్ చేయడంతో మద్రాస్ హైకోర్టు 2021లో ఎయిర్ లైన్ ను రద్దు చేయాలని ఆదేశించింది.
అప్పుడు సెటిల్ మెంట్ ప్లాన్ అంగీకరచించిన తర్వాత కూడా బకాయిలు చెల్లించడంలో స్పైస్ జెట్ విఫలమవుతూ వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే పేమెంట్స్ ఎగవేస్తున్నారంటూ క్రెడిట్ సూయిస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 4.5 మిలియన్ల బకాయిలు చెల్లించడంలో విఫలం కావడంతో ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరింది.
మాజీ యజమాని కళానిధి మారన్ కు 1 బిలియన్ రూపాయలు చెల్లించాలని మరో కేసులో కోర్టు స్పైస్ జెట్ ను ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే 625 మిలియన్ డిపాజిట్ చేసినట్లు ఎయిర్ లైన్ తెలిపింది. మంగళవారం నాటికి పూర్తి చెల్లింపు పూర్తి చేస్తామని వెల్లడించింది.


Click it and Unblock the Notifications