Noida Twin Towers: ట్విన్ టవర్ కూల్చివేతతో కోట్లలో నష్టం.. సూపర్‌టెక్ లిమిటెడ్ ఛైర్మన్ ఏమన్నారంటే..

Noida Twin Towers: నోయిడాలోని సెక్టార్ 93Aలో అతిపెద్ద భవనాలను భారీగా మందుగుండిని వినియోగించి పేల్చివేయటం దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. దీనిని దేశంలోని మీడియా శైతం ప్రత్యేక కవరేజ్ అందించింది.

సూపర్‌టెక్ ఛైర్మన్ స్పందన..

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోయిడాలోని ట్విన్ టవర్ భవనాన్ని ఆదివారం అధికారులు అనేక జాగ్రత్తల మధ్య కూల్చివేశారు. సుదీర్ఘ కోర్టుపోరాటం తరువాత ఇది జరిగింది. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద భూకంపాన్నే సృష్టించింది. అయితే ఈ చర్య కారణంగా తమ కంపెనీకి సుమారు రూ.500 కోట్ల నష్టం వాటిల్లిందని రియల్టీ సంస్థ సూపర్‌టెక్ లిమిటెడ్ ఛైర్మన్ ఆర్కే అరోరా తెలిపారు.

రుణాలపై వడ్డీ..

రుణాలపై వడ్డీ..

భవనాన్ని కూల్చివేయడం వల్ల దాని నిర్మాణానికి అయ్యే ఖర్చు, రుణంపై చెల్లించాల్సిన వడ్డీ రూపంలో కంపెనీకి దాదాపు 500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అరోరా చెప్పారు. 100 మీటర్ల ఎత్తైన ఈ నివాస భవన నిర్మాణంలో ప్రమాణాలను ఉల్లంఘించి నిర్మించడం చట్టవిరుద్ధమని భావించిన సుప్రీంకోర్టు పేలుడు పదార్థాలను ఉపయోగించి దానిని కూల్చివేయాలని ఆదేశించటంతో కంపెనీ భారీగా నష్టపోయింది. అదే క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో రెండు టవర్లను డిస్ట్రాయర్ల సాయంతో కొద్ది సెకన్లలోనే నేలమట్టం చేశారు.

భూమి కొనుగోలు..

భూమి కొనుగోలు..

కంపెనీ మెుత్తం నష్టం సుమారు రూ.500 కోట్లన్న అరోరా.. ఇందులో భవన నిర్మాణం, భూమి కొనుగోలు, క్లియరెన్స్‌ల కోసం నోయిడా అథారిటీకి చెల్లించిన రుసుములు, బ్యాంకులకు రుణాలపై చెల్లించే వడ్డీ ఉన్నాయని తెలిపారు. దీనికి తోడు టవర్లలో ఫ్లాట్లను కొనుగోలు చేసిన వినియోగదారులకు 12 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన 900కు పైగా ఫ్లాట్లు మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.700 కోట్ల ధర పలికాయని చెప్పారు.

కూల్చివేతకు ఖర్చు ఎంతంటే..

కూల్చివేతకు ఖర్చు ఎంతంటే..

ఈ టవర్లను కూల్చివేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ.. నోయిడా డెవలప్‌మెంట్ అథారిటీ ఆమోదించిన బిల్డింగ్ ప్లాన్ ప్రకారం సూపర్‌టెక్ వాటిని నిర్మించిందని అరోరా చెప్పారు. ఈ రెండు టవర్లను పేలుడు పదార్థాలతో కూల్చివేసేందుకు సూపర్ టెక్ ఎడ్ఫిస్ ఇంజినీరింగ్ కంపెనీకి రూ.17.5 కోట్లు చెల్లిస్తోందన్నారు. ఎడిఫైస్ దీనిని అమలు చేయడానికి దక్షిణాఫ్రికా సంస్థ జెట్ డిమోలిషన్స్‌కు బాధ్యతలు అప్పగించింది. ఎట్టకేలకు ఈ భారీ నిర్మాణాన్ని కేవలం సెకన్ల వ్యవధిలో కూల్చివేయటం కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. మరో సారి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇలాంటి తప్పులు చేయటానికి బయపడతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+