For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూపర్‌టెక్ దివాలా, 25,000 హోమ్ బయ్యర్స్‌పై తీవ్ర ప్రభావం

|

ప్రముఖ రియాల్టీ దిగ్గజం సూపర్‌టెక్ లిమిటెడ్ దివాలా తీసినట్లుగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) ప్రకటించింది. బకాయిలు చెల్లించడంలో సదరు సంస్థ విఫలమైందంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిటిషన్ దాఖలు చేయగా, ఎన్సీఎల్టీ ఢిల్లీ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో దాదాపు 25వేల హోమ్ బయ్యర్స్ పైన ప్రభావం పడుతుంది. అయితే ఈ తీర్పు పైన తాము నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తామని సూపర్ టెక్ తెలిపింది.

యూపీలోని నోయిడాలో సూపర్ టెక్ నిర్మించిన ట్విన్ టవర్స్‌ను కూల్చి వేయాలని సుప్రీం కోర్టు గత ఏడాది ఆదేశించింది. దీంతో ఈ కంపెనీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో తమకు బకాయిలు చెల్లించడంలో కంపెనీ విఫలమైందని ఎన్సీఎల్టీని యూనియన్ బ్యాంకు ఆశ్రయించింది. మార్చి 17న కంపెనీ చేసిన వన్ టైమ్ సెటిల్మెంట్ ప్రతిపాదనకు బ్యాంకు నో చెప్పింది. దీంతో ఎగవేతదారుగా గుర్తించేందుకు కంపెనీ తరఫు లాయర్ అంగీకరించారు. ఆ రోజు తీర్పును రిజర్వ్ చేసిన బెంచ్ తాజాగా తన తీర్పును వెలువరించింది.

Supertech Declared Bankrupt, 25,000 Home Buyers May Be Impacted

సూపర్ టెక్ కంపెనీ ప్రస్తుతం గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడాలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన పలు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో దాదాపు ఇరవై ఐదు వేల మంది హోమ్ బయ్యర్స్ తమ ప్లాట్ల కోసం వేచి చూస్తున్నారు. ట్రైబ్యునల్ తీర్పుపై ఈ ప్రభావం ఉంటుంది.

English summary

సూపర్‌టెక్ దివాలా, 25,000 హోమ్ బయ్యర్స్‌పై తీవ్ర ప్రభావం | Supertech Declared Bankrupt, 25,000 Home Buyers May Be Impacted

Real estate developer Supertech was declared bankrupt by the National Company Law Tribunal (NCLT) on Friday in a move that could have an effect on 25,000 home buyers.
Story first published: Friday, March 25, 2022, 19:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X