రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించిన సంగతి మీకు తెలిసందే. దింతో రెపో రేటు 6.25%కి తగ్గింది. గత ఐదు సంవత్సరాలలో రెపో రేటు కొత్త విధించడం కూడా ఇదే తొలిసారి. దీని వల్ల హోమ్ లోన్స్, ఆటోమొబైల్ లోన్స్ సహా ఇతర లోన్స్ తీసుకునే వారికీ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నుండి రుణం తీసుకున్నప్పుడు చెల్లించే వడ్డీ రేటు. రెపో రేటు తగ్గించబడినప్పుడు, వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నుండి తక్కువ వడ్డీ రేటుకు డబ్బు తీసుకోవచ్చు. ఫలితంగా బ్యాంకులు లోన్లు తీసుకునేవారికి తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు అందించే అవకాశం ఉంది.

1 అక్టోబర్ 2019 నుండి అన్ని రిటైల్ ఫ్లోటింగ్ రేటు రుణాలు రెపో రేటుకు అనుసంధానించాయి. కాబట్టి, రెపో రేటు తగ్గినప్పుడు హోమ్ లోన్ వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, వాణిజ్య బ్యాంకులు ప్రతి త్రైమాసికానికి ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షించి అవసరమైతే సవరించాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను త్వరగా మార్చగలవు, దీని వలన మీ లోన్ వడ్డీ రేటు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అతి తక్కువ వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు: 8.10%, లక్ష రూపాయల లోన్ కోసం స్టార్టింగ్ EMI (ప్రతినెల వాయిదా): రూ. 843 ఇది అత్యల్ప వడ్డీ రేటు. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వడ్డీ రేటు: 8.15%, 1 లక్ష రుణానికి ప్రారంభ EMI (ప్రతినెల వాయిదా): రూ. 846. ఇండియన్ బ్యాంక్ వడ్డీ రేటు: 8.30% రూ. 1 లక్ష రుణానికి ప్రారంభ EMI (ప్రతినెల వాయిదా): రూ. 855. భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వడ్డీ రేటు: 8.25% రూ.1 లక్ష రుణానికి ప్రారంభ EMI (ప్రతినెల వాయిదా): రూ. 852. IDBI బ్యాంక్ లక్ష రూపాయల రుణానికి 8.50% వడ్డీ రేటు అలాగే రూ. 868 EMI (ప్రతినెల వాయిదా) అందిస్తుంది.
ఇతర ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు: యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వడ్డీ రేటు: 8.75% రూ. లక్ష రుణానికి మొదటి EMI (ప్రతినెల వాయిదా): రూ. 884. యెస్ బ్యాంక్ రూ. 1 లక్ష రుణానికి రూ. 900 EMI (ప్రతినెల వాయిదా)తో 9.00% వడ్డీ రేటును అందిస్తుంది. అయితే లోన్స్ తీసుకునేవారు ముందుగా బ్యాంకు వడ్డీ రేటు మార్పులను పర్యవేక్షించాలి. అలాగే తక్కువ వడ్డీ రేట్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా, మీరు మీ ప్రతినెల emi పేమెంట్స్ ఖర్చు తగ్గించుకుని ఎక్కువ సేవింగ్స్ చేసుకోవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications