నేటి ప్రపంచంలో అంతరాయం లేని ఇంటర్నెట్ లభ్యత అవసరం. మొబైల్ డేటా వర్క్ నుండి ఎడ్యుకేషన్, ఆరోగ్యం, విశ్రాంతి నుండి లైఫ్ స్టయిల్ వరకు ప్రతిదీ అందిస్తుంది. అందువల్ల, ఆన్ లిమిటెడ్ డేటా అనుభవం కోసం డిమాండ్ గతంలో కంటే ఎక్కువగా ఉంది. ఈ డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశపు ప్రముఖ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా భారతదేశపు మొట్టమొదటి ఆన్ లిమిటెడ్ డేటా ప్లాన్ నాన్ స్టాప్ హీరోని ప్రారంభించినట్లు ప్రకటించింది.
ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం డేటా కోటా ముగిసే సమస్యను పరిష్కరించడానికి రూపొందించిన 'నాన్ స్టాప్ హీరో' ప్లాన్ 24 గంటల ఆన్ లిమిటెడ్ డేటా అనుభవాన్ని అందించే లక్ష్యంగా వస్తుంది. భారతదేశం నేడు డేటా విప్లవాన్ని చూస్తోంది. సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ అండ్ పాలసీ రీసెర్చ్ లేటెస్ట్ నివేదిక ప్రకారం, భారతదేశంలో డేటా వినియోగం గత దశాబ్దంలో 288 రెట్లు పెరిగింది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) వార్షిక నివేదిక ప్రకారం, దేశంలో ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య మార్చి 2023లో 88.1 కోట్ల నుండి మార్చి 2024 నాటికి 95.4 కోట్లకు పెరిగింది. ఇది మార్చి 2024 నాటికి ఒక్కో యూజరుకు సగటు ప్రతినెల డేటా వినియోగం 20.27 GBకి చేరుకుంది. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావడంతో వినియోగం మరింత పెరిగింది.
Vodafone ఇండియా నాన్‌స్టాప్ హీరో ప్లాన్ వివిధ రీఛార్జ్ ప్యాక్‌లలో OTT ప్రయోజనాలతో పాటు ఆన్ లిమిటెడ్ డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్‌లు ఇంకా 100 SMSలను అందించే హై-స్పీడ్ కనెక్టివిటీకి పెరుగుతున్న డిమాండ్‌ను అందిస్తుంది.
Vodafone Ideaను OpenSignal భారతదేశంలో అత్యుత్తమ 4G నెట్‌వర్క్ ప్రొవైడర్‌గా గుర్తించింది. ఈ విషయం OpenSignal నవంబర్ 2024 4G నెట్‌వర్క్ ఎక్స్పీరియన్స్ నివేదికలో వెల్లడైంది. దీని డేటా స్పీడ్, కాల్‌లు, గేమింగ్ అండ్ వీడియో స్ట్రీమింగ్ కస్టమర్‌లకు అత్యుత్తమ అనుభవాన్ని అందించడంలో ముందంజలో ఉన్నాయి. ఈ కొత్త ఆఫర్ వోడాఫోన్ ఐడియా కస్టమర్లను మొదటి స్థానంలో ఉంచడంలో కమిట్మెంట్ ప్రదర్శిస్తుంది.
రూ. 365కే ఆన్ లిమిటెడ్ హీరో ప్లాన్: కేవలం రూ. 365తో ప్రారంభమయ్యే నాన్ స్టాప్ హీరో ప్లాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్‌గఢ్‌లలో అందుబాటులో ఉంది. రీఛార్జ్ ప్యాక్‌లోని ప్రయోజనాలు వేర్వేరు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి.
Vi అఫీషియల్ ప్రకటన: Vodafone Idea CMO అవనీష్ ఖోస్లా మాట్లాడుతూ, కస్టమర్‌లకు బెస్ట్ కనెక్టివిటీ పరిష్కారాలను అందించడమే కంపెనీ లక్ష్యం ఇంకా Vodafone Ideaలో వినియోగదారుల అవసరాలను తీర్చే, కస్టమర్‌లు ఆన్ లిమిటెడ్ డేటాను ఆస్వాదించేలా వినూత్నమైన ప్లాన్‌లను అందించడంపై దృష్టి సారించాం. రీఛార్జ్ పీరియడ్, నాన్‌స్టాప్ ప్లాన్ గేమ్ ఛేంజర్ అని చెప్పారు.


Click it and Unblock the Notifications