ఐపిఒకి సన్‌షైన్ పిక్చర్స్.. భారీగా ఆదాయం..సెబీ అనుమతికి 'ది కేరళ స్టోరీ' నిర్మాత..
ఈ ఏడాది 2025 మొదటి నుండే కంపెనీలు ఐపిఒలతో క్యూ కడుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ రంగ సంస్థలు కూడా ఈ ఏడాది ఐపీఓలతో రానున్నాయి. వీటిలో ఒక ఐపిఒ-సన్‌షైన్ పిక్చర్స్ లిమిటెడ్ కావచ్చు. నిర్మాత అండ్ దర్శకుడు విపుల్ అమృతలాల్ షా యాజమాన్యంలోని ఫిలిం ప్రొడక్షన్ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ లిమిటెడ్ ఐపిఒ ద్వారా ఫండ్స్ సేకరించేందుకు మార్కెట్ రెగ్యూలేటరీ సంస్థ సెబీకి డాకుమెంట్స్ ఫైల్ చేసింది.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి ఫైల్ చేసిన డాకుమెంట్స్ ప్రకారం 83.75 లక్షల షేర్ల ప్రతిపాదిత IPOలో 50 లక్షల కొత్త షేర్లు అలాగే 33.75 లక్షల ఆఫర్ ఫర్ సేల్ (OFS) షేర్లు ఉన్నాయి. ప్రమోటర్ విపుల్ అమృత్‌లాల్ షా 23.69 లక్షల షేర్లను, షెఫాలీ విపుల్ షా 10.05 లక్షల షేర్లను విక్రయించాలని యోచిస్తున్నారు.

ఈ ఫండ్స్ తో ఎం చేస్తారంటే ?
సన్‌షైన్ పిక్చర్స్ లిమిటెడ్ లాంగ్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి IPO ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉపయోగించాలని యోచిస్తోంది. దీనితో పాటు రూ. 94 కోట్లు ఇతర జనరల్ కార్పొరేట్ అవసరాలతో సహా భవిష్యత్ అభివృద్ధి ఇంకా కార్యకలాపాల కోసం ఉపయోగిస్తుంది. GYR క్యాపిటల్ అడ్వైజర్స్ IPO కోసం బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా ఉంటారు.
కంపెనీ గురించి సమాచారం
సన్‌షైన్ పిక్చర్స్ అనేది సినిమాలు ఇంకా వెబ్ సిరీస్‌ల నిర్మాణం, అభివృద్ధి, మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో కొనసాగుతున్న పాపులర్ నిర్మాణ సంస్థ. ఈ సంస్థ పాపులర్ ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడితే కేరళ స్టోరీ, కమాండో, ఫోర్స్, యాక్షన్ రీప్లే వంటి సినిమాలు ఉన్నాయి. కేరళ స్టోరీ పై చాలా వివాదాలు కూడా వచ్చాయి. విపుల్ షా ఈ సినిమాని నిర్మించారు. పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్, బవేజా స్టూడియోస్ అండ్ బాలాజీ టెలిఫిల్మ్స్ వంటి లిస్టెడ్ కంపెనీలతో సన్‌షైన్ పిక్చర్స్ కి పోటీగా నిలుస్తుంది.
లాభాల్లో కంపెనీ
సన్‌షైన్ పిక్చర్స్ లిమిటెడ్ గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా అలాగే FY2025 మొదట్లో లాభాల్లో ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం మొదట్లో కంపెనీ లాభం రూ. 45.64 కోట్లు, 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 52.45 కోట్లు, 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.31 కోట్లు అలాగే 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.2 కోట్లు. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నిర్వహణ ఆదాయం రూ. 133.8 కోట్లు, 2023లో రూ. 26.51 కోట్లు అలాగే 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 87.13 కోట్లు కాగా, 2025 ఆర్థిక సంవత్సరం మొదట్లో కంపెనీ రూ. 39.02 కోట్లు ఆర్జించింది.


Click it and Unblock the Notifications