Penny Stock: లక్షను రూ.24 లక్షలు చేసిన స్టాక్.. ఆ ప్రకటనతో ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్స్..!!
Multibagger Stock: ఒకప్పుడు కేవలం పైసల్లో ధర ఉన్న పెన్నీ స్టాక్స్ ప్రస్తుతం ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది పెట్టుబడిదారలు ఈ కంపెనీల నుంచి మల్టీబ్యాగర్ రాబడులను అందుకుంటున్నారు. సరైన సమయంలో మల్టీబ్యాగర్ షేర్లను తక్కువ ధరల వద్ద గుర్తించిన తెలివైన ఇన్వెస్టర్లు మాత్రం వాటి లాభాల ఫలాలను దీర్ఘకాలంలో అనుభవిస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది మార్కెట్లో ట్రెండింగ్‌లో కొనసాగుతున్న సన్‌షైన్ క్యాపిటల్ కంపెనీ షేర్ల గురించే. చిన్న షేర్ అయినప్పటికీ కంపెనీ తన పనితీరుతో ఇన్వెస్టర్లను భారీగా రివార్డ్ చేస్తోంది. బుధవారం ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 4.2% పెరిగి గరిష్ట స్థాయి రూ.2.45కి తాకాయి. అయితే దీని వెనుక ఉన్న కారణం కంపెనీ తన వ్యాపార విస్తరణ ప్రణాళికను ప్రకటించటమేనని తెలుస్తోంది. కంపెనీ ఈ క్రమంలో కొత్త వెంచర్లోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించటంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా కొనుగోళ్లకు దిగారు. అప్పటి నుంచి ట్రేడింగ్ సమయంలో స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ ఉన్నప్పటికీ తన బుల్ జోరును కొనసాగించింది.

వాస్తవానికి నాలుగేళ్ల కిందట కంపెనీ షేర్లు ఒక్కోటి కేవలం 10 పైసల ధర వద్ద ఉన్నాయి. అయితే ఇప్పుడు దాదాపు 2 రూపాయలకు పైన ట్రేడింగ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కంపెనీ బోర్డు సభ్యులు మ్యూచువల్ ఫండ్ పంపిణీ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం దేశంలో మ్యూచువల్ ఫండ్ వ్యాపారం భారీగా ఇన్వెస్టర్ల నుంచి ఆదరణను పొందుతున్న సంగతి తెలిసిందే. మార్కెట్ వ్యాప్తి, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉత్తమ ఫిన్‌టెక్ పద్ధతులను అవలంబించాలని కూడా ఇది పరిష్కరించబడింది. పెట్టుబడిదారులకు విస్తృత శ్రేణి మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తులను అందించడం ద్వారా కంపెనీ ఈ వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లోకి ప్రవేశించాలని, తద్వారా వృద్ధిని పెంచుతుందని బోర్డు భావిస్తోంది.
లక్షకు రూ.24 లక్షల రాబడి..
కంపెనీ గడచిన ఏడాది కాలంలో తన ఇన్వెస్టర్లకు దాదాపు 365 శాతం రాబడిని అందించింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ ధర 49 పైసల నుంచి ప్రస్తుత రేటుకు చేరుకుంది. అలాగే నాలుగేళ్ల కిందట కంపెనీ షేర్ల ధర అక్టోబర్ 14, 2021లో కేవలం ఒక్కోటి 10 పైసలుగా ఉంది. అప్పటి నుంచి పెట్టుబడిదారులు ఏకంగా 2350 శాతం రాబడిని అందుకున్నారు. ఈ ధర వద్ద ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి దీర్ఘకాలిక వ్యూహంతో ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వాటి ధర రూ.24 లక్షలకు చేరుకుని ఉండేది. అలాగే కంపెనీ షేర్లకు 52 వారాల గరిష్ఠ ధర రూ.4.13గా ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ.0.48 వద్ద ఉంది. అలాగే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,187.02 కోట్ల వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications