Free Shares: డిసెంబర్ త్రైమాసికంలో దేశంలోని కార్పొరేట్ కంపెనీలు తన ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని సంస్థలు తమ పెట్టుబడిదారులకు ఉచితంగా బోనస్ షేర్లను అందిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బోనస్ షేర్లను ఇన్వెస్టర్లకు అందించటంతో పాటు స్టాక్ స్ప్లిట్ చేస్తున్న సన్‌షైన్ క్యాపిటల్ లిమిటెడ్ కంపెనీ గురించే. వాస్తవానికి కంపెనీ బోర్టు వీటికి సంబంధించిన నిర్ణయం తీసుకుంది. దీనికోసం రికార్డు తేదీని వచ్చేవారంగా నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీ ఒక్కో షేరు ధర రూ.300 కంటే తక్కువగా ఉంది.

ప్రస్తుతం సన్‌షైన్ క్యాపిటల్ లిమిటెడ్ కంపెనీ షేర్లు ఫేస్ వ్యాల్యూ ఒక్కొక్కటి రూ.10గా ఉంది. ప్రస్తుతం కంపెనీ ఒక్కో షేరును 10 ముక్కలుగా విభజిస్తోంది. దీంతో కంపెనీ షేర్ ముఖ విలువ రూ.1కి తగ్గనుంది. అలాగే కంపెనీ రూ.1 ముఖ విలువతో ఒక షేరుపై 7 బోనస్ షేర్లను అందిస్తోంది. స్టాక్ స్ప్లిట్, బోనస్ ఇష్యూకి రికార్డ్ తేదీని మార్చి 8, 2024గా కంపెనీ నిర్ణయించింది. దీంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.
నేడు ప్రత్యేకంగా జరిగిన ట్రేడింగ్ సెషన్లో కంపెనీ షేర్లు 2 శాతం మేర లాభపడ్డాయి. దీంతో కంపెనీ షేర్లు రూ.278.60 స్థాయికి చేరుకున్నాయి. గత నెల రోజుల్లో కంపెనీ షేర్ల ధరలు 48 శాతానికి పైగా పెరిగాయి. అదే సమయంలో 6 నెలల పాటు స్టాక్‌ను కలిగి ఉన్న పెట్టుబడిదారులు ఇప్పటివరకు 552 శాతం లాభం పొందారు. స్టాక్ మార్కెట్‌లో కంపెనీ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.278.60.. 52 వారాల కనిష్ట స్థాయి రూ.34.49గా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.362.76 కోట్లుగా ఉంది. కంపెనీ మొదటిసారిగా బోనస్ షేర్లను పంపిణీ చేయబోతోంది.


Click it and Unblock the Notifications