Sunlight Recycling IPO: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా ఐపీవోలు లిస్ట్ అవుతున్నాయి. ఈ క్రమంలో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్ల తలరాత పూర్తిగా మారిపోయింది. ఐపీవోలో షేర్లు పొందిన పెట్టుబడిదారులు డబ్బు కొన్ని నిమిషాల్లోనే రెట్టింపు కావటంతో వారు పండుగ చేసుకుంటున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సన్‌లైట్ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు నేడు స్టాక్ మార్కెట్లలో 90 శాతం ప్రీమియం ధరకు అద్బుతమైన జాబితాను నమోదు చేశాయి. వాస్తవానికి ఇష్యూ సమయంలో ఒక్కో షేరును కంపెనీ గరిష్ఠంగా రూ.105 ధరకు విక్రయించినప్పటికీ అవి రూ.199 రేటుకు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. గ్రేమార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఐపీవో షేర్లు పేలుడు లిస్టింగ్ చూశాయి. దీని తర్వాత కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకాయి.

లిస్టింగ్ తర్వాత మార్కెట్లో కంపెనీ షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు స్పందన రావటంతో కొన్ని నిమిషాల్లోనే 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకాయి. దీంతో ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో మార్కెట్లోకి వచ్చిన స్టాక్ ధర ఇంట్రాడేలో రూ.209.45కి చేరుకున్నాయి. ఐపీవో ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం ఆగస్టు 16 నుంచి ఆగస్టు 20 వరకు తెరచి ఉంది. ఈ క్రమంలో కంపెనీ ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.100 నుంచి రూ.105గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించింది. దీంతో ఐపీవోలో పాల్గొన్న వ్యక్తులు కనీసం ఒక లాటు కొనుగోలు కోసం రూ.1.26 లక్షలు వెచ్చించాల్సి వచ్చింది.
తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.30.24 కోట్లను విజయవంతంగా సమీకరించింది. అలాగే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8.59 కోట్లను పొందింది. ఈ ప్రక్రియలో 28.80 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించిన కంపెనీ ఐపీవో 3 రోజుల సబ్‌స్క్రిప్షన్ వ్యవధిలో IPO 310 కంటే ఎక్కువ సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.
కంపెనీ వ్యాపారం:
సన్‌లైట్ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ 2012లో స్థాపించబడింది. విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమల కోసం కాపర్ స్క్రాప్‌ను రీసైక్లింగ్ చేయడం ద్వారా కాపర్ రాడ్‌లు, వైర్లు, కాపర్ ఎర్తింగ్ వైర్లు, కాపర్ ఎర్తింగ్ స్ట్రిప్స్, కాపర్ కండక్టర్లు, కాపర్ వైర్ రాడ్‌లు మొదలైన వాటిని తయారు చేస్తోంది.
కంపెనీ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో కస్టమర్ స్పెసిఫికేషన్‌ల ప్రకారం అన్ని రకాల రాగి ఉత్పత్తులలో వివిధ రకాలైన గ్రేడ్‌లు, గేజ్‌లు, వెడల్పులు, ప్రమాణాలను కలిగి ఉన్న విభిన్న ఉత్పత్తుల శ్రేణిని అందిస్తుంది. ప్రస్తుతం కంపెనీ గుజరాత్‌లోని ఖేడాలో ప్రధాన కార్యాలయంతో పాటు ఉత్పత్తి సదుపాయాన్ని కలిగి ఉంది. మార్చి 31, 2024 నాటికి కంపెనీ కార్యకలాపాల ద్వారా మొత్తం ఆదాయం రూ.85,168.31 లక్షలుగా ఉంది.


Click it and Unblock the Notifications