WAAYU App: ప్రస్తుతం దేశంలో ఫుడ్ డెలివరీ వ్యాపారానికి డిమాండ్ భారీగానే ఉంది. టెక్నాలజీ అందుబాటులోకి రావటంతో వినియోగదారులు పెరుగుతున్న తరుణంలో దానిని క్యాష్ చేసుకునేందుకు కొత్త కంపెనీలు ఈ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నాయి.
ఇప్పటి వరకు ఈ రంగంలో కింగ్ మేకర్లుగా ఉన్న స్విగ్గీ, జొమాటోలకు ప్రస్తుతం గట్టి పోటీ మెుదలయింది. కొన్ని రోజుల కింద నుంచి ప్రభుత్వానికి చెందిన ONDC ఫుడ్ డెలివరీ రంగంలో గట్టి పోటీని అందిస్తోంది. స్విగ్గీ, జొమాటోలతో పోల్చితే తాలా తక్కువకు సేవలను అందిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ నటుడు సూనీల్ శెట్టి వాయు యాప్ తన ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. గతంలో అక్షయ్ కుమార్ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టగా.. ఇప్పుడు సునీల్ శెట్టి పెద్ద పెట్టుబడి పెట్టాడు. అయితే ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేశారన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ క్రమంలో మంగళవారం యాప్ ను అధికారికంగా ప్రారంభించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. జీరో కమీషన్ ప్లాట్‌ఫారమ్‌తో రెస్టారెంట్లను అందించడం దీని లక్ష్యంగా ఉంది.
ప్రస్తుతం కంపెనీ ముంబైలోని మాయానగరిలో తన సేవలను ప్రారంభించింది. ఇది ముంబై BMC, మీరా భయందర్, నవీ ముంబై, థానే, పూణే, పాల్ఘర్‌లోని చాలా ప్రాంతాల నుంచి రెస్టారెంట్‌లను కూడా కవర్ చేస్తోంది. ముంబై తర్వాత కంపెనీ ఇతర మెట్రో, నాన్ మెట్రో నగరాలకు సైతం విస్తరించాలని యోచిస్తోంది. పైగా కంపెనీ నటుడు సునీల్ శెట్టిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. అలాగే కంపెనీలో ఈ నటుడికి పెట్టుబడి కూడా ఉంది. సునీల్ శెట్టి ఇప్పటికే చాలా స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications