IPO News: చిచ్చుబుడ్డి ఐపీవో.. తొలిరోజే ఇన్వెస్టర్ల డబ్బు మూడింతలు.. క్రేజీ స్టాక్..
IPO News: ఇటీవలి కాలంలో మార్కెట్లోకి వస్తున్న ఐపీవోలు ఇన్వెస్టర్లకు వేగంగా లాభాలను అందించటంలో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ఒకటి డబ్బులు డబుల్ చేస్తే మరొకిటి ఏకంగా ట్రిపుల్ చేసి మల్టీబ్యాగర్ స్టాక్ అని అనిపించుకుంది.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఈరోజే మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎస్ఎమ్ఈ కేటగిరీ ఐపీవో స్టాక్ సన్‌గర్నర్ ఎనర్జీస్ గురించే. ఇది పవర్ సొల్యూషన్స్ వ్యాపారంలో ఉన్న సంస్థ. కంపెనీ తన ఐపీవో షేర్ ధరను ఒక్కొక్కటి రూ.83గా నిర్ణయించగా.. స్టాక్ మార్కెట్లో 200 శాతం ప్రీమియం ధరకు లిస్టింగ్ అయ్యింది. దీంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవటంతో పాటు సంతోషంగా ఉన్నారు. స్టాక్ రూ.237.50 రేటు వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

ఇంట్రాడేలో స్టాక్ గరిష్ఠంగా రూ.262 స్థాయిని తాకింది. దీంతో అనేక మంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపారు. దీంతో స్టాక్ దిగువ సర్క్యూట్ ను తాకింది. కంపెనీ ఐపీవో కోసం ఒక్కో లాట్ లో 1600 షేర్లను విక్రయించింది. ఈ క్రమంలో కంపెనీ మెుత్తంగా 6.40 లక్షల ఫ్రెష్ షేర్లను విక్రయించింది. ఈ ఐపీవో ఆగస్టు 21న ప్రారంభమై.. 23న ముగిసింది. IPOకి లీడ్ మేనేజర్ ఫాస్ట్ ట్రాక్ ఫిన్‌సెక్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్ట్రార్ స్కైలైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరించాయి.

Sungarner Energy వినియోగదారులకు విద్యుత్ రంగంలో డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సేవలను అందిస్తుంది. అలాగే సోలార్ ప్యానెల్‌లు, UPS, బ్యాటరీలు, ఇన్వర్టర్‌లు, సోలార్ ప్యానెల్‌లు వంటి పవర్ సొల్యూషన్‌లను అందిస్తోంది. సౌరశక్తి ఉత్పత్తి వ్యవస్థలు, దాని ప్లాంట్‌లతో అనుబంధించబడిన ప్రాజెక్ట్‌ల నిర్వహణతో సహా కంపెనీ అనేక రకాల సేవలను అందిస్తుంది. ప్రస్తుతం కంపెనీకి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్, అసోం, బెంగాల్‌లలో 6 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. అలాగే నైజీరియా, భూటాన్, దుబాయ్, నేపాల్, లెబనాన్‌లలో వ్యాపారాలను నిర్వహిస్తోంది.


Click it and Unblock the Notifications