రైల్వే బోర్డు నూతన చైర్మన్, సీఈఓగా సునీత్ శర్మ నియామకం
రైల్వే బోర్డు నూతన చైర్మన్ సీఈఓ గా సునీత్ శర్మ నియమితులయ్యారు. ఈమేరకు క్యాబినెట్ నియామక కమిటీ గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సిఆర్‌బి, సిఇఒ వినోద్ కుమార్ యాదవ్ రైల్వే బోర్డు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన తన పదవీ కాలాన్ని నేటితో విజయవంతంగా పూర్తి చేశారు . వినోద్ కుమార్ యాదవ్ పదవీ విరమణ తర్వాత కూడా ఆయనకు ఒక సంవత్సరం పొడిగింపు ఇచ్చారు. ఆ పొడిగింపు కాస్తా నేటితో పూర్తయింది.
రైల్వే బోర్డు తదుపరి ఛైర్మన్ మరియు సిఇఒగా సునీత్ శర్మ వ్యవహరించనున్నారు. 1978 బ్యాచ్ యొక్క స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ ఆఫీసర్ గా పనిచేసిన సునీత్ శర్మ , తూర్పు రైల్వే జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహించారు. ఆయన జోనల్ రైల్వేస్, వర్క్‌షాప్‌లు మరియు డీజిల్ లోకో షెడ్‌లలో పనిచేశాడు.

జిఎం మెట్రో రైల్వే, జిఎం ఈస్టర్న్ రైల్వే గాను బాధ్యతలు చేపట్టడానికి ముందు, శర్మ జనరల్ మేనేజర్ గా మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ, రాయ బరేలీలో పనిచేశారు.
వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్‌లో పనిచేస్తున్నప్పుడు, 100 శాతం విద్యుదీకరణ లక్ష్యంతో భారతీయ రైల్వే లక్ష్యాన్ని సాధించడానికి డీజిల్ లోకోమోటివ్స్‌ను ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌గా మార్చడంలో శర్మ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయనకు రైల్వే బోర్డు నూతన చైర్మన్ సీఈవోగా బాధ్యతలు అప్పగించడంతో త్వరలో ఆయన నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.


Click it and Unblock the Notifications