గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌కి 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 281 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.21,44,53,58,000) పారితోషికం చెల్లించినట్లు ఇంటర్నెట్ దిగ్గజం అల్భాబెట్ దిగ్గజం ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న సీఈవో జాబితాలో సుందర్ పిచాయ్ చేరారు. పిచాయ్ డిసెంబర్ 2019లో అల్ఫాబెట్ పగ్గాలు చేపట్టారు.

6,50,000 డాలర్ల నుండి 2 మిలియన్ డాలర్లకు పెంపు
సుందర్ పిచాయ్ వేతన ప్యాకేజీలో అత్యధిక భాగం స్టాక్ అవార్డ్స్ రూపంలో చెల్లించారు. మార్కెట్లో అల్ఫాబెట్ షేర్ల హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఆయన వార్షిక వేతనం లెక్కిస్తారు. ఇక గత ఏడాదికి గాను సుందర్ పిచాయ్ శాలరీ 6,50,000 డాలర్లు. ప్రస్తుతం దీనిని 2 మిలియన్ డాలర్లకు పెంచినట్లు అల్ఫాబెట్ తెలిపింది.

ఉద్యోగాల సగటు వేతనం కంటే వెయ్యి రెట్లు
తమ కంపెనీ ఉద్యోగుల సరాసరి వేతనాల మొత్తం కంటే తమ సీఈవో పారితోషికం 1,085 రెట్లు ఎక్కువ అని అల్ఫాబెట్ తెలిపింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అల్ఫాబెట్‌లో ఈ ఏడాది ఉద్యోగాలు, పెట్టుబడి ప్రణాళికలకు సంబంధించి కోత విధిస్తూ సీఈవో సుందర్ పిచాయ్ నిర్ణయం తీసుకున్నారు.

ఇలా చెల్లింపు
ప్యాకేజీలో ఎక్కువ భాగం స్టాక్ అవార్డ్స్, కొన్ని ఎస్ అండ్ పీ 100 సూచీలోని ఇతర కంపెనీలతో పోలిస్తే అల్ఫాబెట్ రిటర్న్స్ ఆధారంగా చెల్లిస్తున్నట్లు తెలిపింది. చెన్నైకి చెందిన సాధారణ కుటుంబం నుండి వచ్చిన పిచాయ్ 2015లో గూగుల్ సీఈవోగా అయ్యారు. గత ఏడాది అల్ఫాబెట్ సీఈవోగా నియమితులయ్యారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications