ఆల్ఫాబెట్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్(Sunder Pichai) 2022లో దాదాపు $226 మిలియన్ల మొత్తం పారితోషకాన్ని అందుకున్నారు. ఇది మధ్యస్థ ఉద్యోగి వేతనం కంటే 800 రెట్లు ఎక్కువ అని కంపెనీ శుక్రవారం సెక్యూరిటీస్ ఫైలింగ్‌లో తెలిపింది. ఇదీ భారత కరెన్సీలో రూ.1850 కోట్లకు సమానం. పిచాయ్ పరితోషికంలో సుమారు 218 మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డులు ఉన్నాయని ఫైలింగ్ లో పేర్కొన్నారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలను తొలగిస్తున్న సమయంలో పిచాయ్ భారీ ఎత్తున పారితోషికం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సుందర్ పిచాయ్ మూడేళ్ల కాలానికి ఈ పారితోషికాన్ని అందుకున్నారు. 2019 కూడా పిచాయ్ స్థాయిలో పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. గత మూడేళ్లుగా పిచాయ్ స్థిరంగా 2 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం అందుకుంటున్నట్లు కంపెనీ సెక్యూరిటీస్ ఫైలింగ్‌లో పేర్కొంది. లే ఆఫ్ ల వేళ సుందర్ పిచాయ్ పెద్ద మొత్తంలో వేతనం పొందడం చర్చనీయంశంగా మారింది. కాలిఫోర్నియాకు చెందిన ది మౌంటైన్ వ్యూ, జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 12,000 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఇది దాని గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 6%కి సమానంగా ఉంది.

ఈ నెల ప్రారంభంలో తొలగింపులపై వివాదం కారణంగా వందలాది మంది గూగుల్ ఉద్యోగులు కంపెనీ లండన్ కార్యాలయాల వద్ద వాకౌట్ చేశారు.మార్చిలో 200 మందికి పైగా కార్మికులను తొలగించిన తర్వాత గూగుల్ ఉద్యోగులు కంపెనీ జ్యూరిచ్ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు.
More From GoodReturns

ఉచితంగా AI కోర్సులు నేర్చుకునే అవకాశం! ఎలా రిజిస్టర్ అవ్వాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications