Google News: హద్దులు లేకుండా పోతున్న లేఆఫ్స్ ఇంకెన్ని రోజులు కొనసాగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్స్ వరకు సడన్ లేఆఫ్స్‌తో ఉద్యోగులను ఏడిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్నసిబ్బంది తమ వంతు ఎప్పుడోనని భయపడుతున్నారు. ఈ లేఆఫ్స్‌కు ఎప్పుడు ముగింపు లభిస్తుండా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా టాప్ టెక్ కంపెనీలు కూడా ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నాయి. అగ్ర IT దిగ్గజం గూగుల్ 2023లో వేలాది మంది సిబ్బందికి ఉద్వాసన పలికింది. తాజాగా దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఉద్యోగుల భయాన్ని రెట్టింపు చేసింది. తమ కంపెనీలో తొలగింపులు 2024లో కూడా ఓ క్రమ పద్ధతిలో కొనసాగిస్తామని తేల్చి చెప్పింది.

టెక్ దిగ్గజం అభివృద్ది వేగాన్ని మెరుగుపరచడానికి శ్రామిక శక్తిని తగ్గించడం కొనసాగిస్తుందని గూగుల్ CEO సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఉద్యోగుల్లో భయాందోళనలను పోగొట్టడానికి ఇటీవల కంపెనీ ఆల్ హ్యాండ్స్ సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఇందులో పలువురు సిబ్బంది సంధించిన ప్రశ్నలకు పిచాయ్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
వర్క్‌ఫోర్స్‌ను మరింత తగ్గించాలనే కంపెనీ ఉద్దేశాన్ని గూగుల్ CEO ఇందులో ధ్రువీకరించారు. ఈ ఏడాది చివరి అర్ధభాగంలో లేఆఫ్స్ ప్రభావం తక్కువగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఏడాది పొడవునా హెడ్‌కౌంట్ గ్రోత్‌ను నిర్వహించడంలో కంపెనీ చాలా క్రమశిక్షణతో పని చేస్తోందన్నారు. ఇటీవల బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ టీమ్స్‌ను సరళీకృతం చేసేందుకు, అధిక ప్రాధాన్యత ఉన్నచోట్ల ఉద్యోగుల కేటాయింపు కోసం కంపెనీ క్రమం తప్పకుండా లేఆఫ్స్ అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications