Dividend Stock: ఏడాదిలో 5వ సారి డివిడెండ్ ఇస్తున్న స్టాక్.. ఈసారి రికార్డు తేదీ ఎప్పుడంటే..
Dividend Stock: సాధారణంగా కంపెనీలు ఏడాదికి ఒకసారో మహా అయితే రెండు సార్లో ఇన్వెస్టర్లకు డివిడెండ్ అందిస్తుంటాయి. పైగా క్రమం తప్పకుండా డివిడెండ్ అందించే కంపెనీలు మార్కెట్లో చాలా అరుదుగా ఉంటాయి. ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి క్యాపిటల్ అప్రీసియేషన్ తో పాటు డివిడెండ్ ఆదాయం కూడా లభిస్తుంటుంది. అంటే ఒకేసారి రెండు ప్రయోజనాలన్నమాట.

5వ సారి డివిడెండ్..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది సన్ నెట్‌వర్క్ కంపెనీ గురించే. ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు కొత్త ఏడాది శుభవార్త తెలిపింది. గడచిన ఏడాది కాలంలో కంపెనీ ఐదోసారి డివిడెండ్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. డివిడెండ్ పొందేందుకు ఫిబ్రవరి 13ను రికార్డు తేదీగా సన్ టీవీ నెట్‌వర్క్ బోర్డు నిర్ణయించింది. అంటే మరో వారం రోజుల్లో ఇన్వెస్టర్లు ధనాన్ని పొందనున్నారు.

ఒక్కో షేరుపై ఇలా..
సన్ నెట్‌వర్క్ ఒక్కో షేరుపై రూ.3.75 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీకి అందించిన సమాచారంలో తెలిపింది. అర్హులైన ఇన్వెస్టర్లందరి ఖాతాల్లోకి డివిడెండ్ సొమ్ము పడనుంది. అంటే రూ.5 ఫేస్ వాల్యూ కలిగిన షేరుపై కంపెనీ 75 శాతం డివిడెండ్ చెల్లిస్తోంది. అంటే ఫిబ్రవరి 12, 2023 నుంచి షేర్ మార్కెట్లో ఎక్స్-డివిడెండ్‌గా ట్రేడ్ కానుంది.

గతంలో డివిడెండ్..
2022లో కంపెనీ తన ఇన్వెస్టర్లకు ఏకంగా నాలుగు సార్లు డివిడెండ్ చెల్లించింది. మెుదటగా ఫిబ్రవరిలో రూ.2.50, రెండవసారి రూ.5, మూడవసారి రూ.5 చివరగా నాలుగోసారి 2022లో కంపెనీ రూ.3.75ను డివిడెండ్ గా చెల్లించింది. అంటే 2022లో మెుత్తంగా ఇన్వెస్టర్లు కంపెనీ నుంచి రూ.16 డివిడెండ్ రూపంలో ఆదాయంగా పొందారు. ఇప్పుడు కంపెనీ ఐదవసారి డివిడెండ్ చెల్లిస్తున్నట్లు ప్రకటించటంతో ఇన్వెస్టర్లు సంతోషంలో ఉన్నారు. ఈరోజు స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి రూ.459.35 వద్ద ట్రేడవుతోంది.

కంపెనీ వ్యాపారం..
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సన్ నెట్ వర్క్ దేశంలో ప్రఖ్యాత మాస్ మీడియా సంస్థగా గుర్తింపు పొందింది. కంపెనీ 1992లో స్థాపించటం జరిగింది. దీనిని డీఎంకే నేత, మాజీ కేంద్ర మంత్రి కళానిధి మారన్ స్థాపించారు. సన్ గ్రూప్ ప్రస్తుతం ఆసియాలో అతిపెద్ద టెలివిజన్ కంపెనీగా కొనసాగుతోంది. ప్రస్తుతం కంపెనీకి అనేక భారతీయ భాషల్లో ఛానెల్స్, ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లతో పాటు సన్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థ కూడా ఉంది. తెలుగులో జెమినీ టీవీ పేరుతో కంపెనీ ఛానెల్స్ కలిగి ఉంది.


Click it and Unblock the Notifications