Sun Pharma Results: నేడు దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా తన నాలుగో త్రైమాసిక ఫలితాలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ క్రమంలో విశ్లేషకుల అంచనాలకు మించిన పనితీరుతో మార్కెట్లను ఫార్మా జెయింట్ మెస్మరైజ్ చేసింది.
మే 22న ఫార్మా మేజర్ సన్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఊహించిన దాని కంటే మెరుగైన ఏకీకృత నికర లాభం రూ.2,654.5 కోట్లుగా నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 34 శాతం అధికంగా నమోదైంది. మార్కెట్లోని ఎనిమిది బ్రోకరేజ్ సంస్థలు కంపెనీ క్యూ4 నికర లాభం రూ.2,412 కోట్లుగా ఉండొచ్చని అభిప్రాయపడ్డాయి. ఈ కాలంలో కంపెనీ ఏకీకృత ఆదాయం 9 శాతం అధికంగా రూ.11,982.9 కోట్లుగా నివేదించబడింది. ఏడాది కింద ఇదే కాలానికి కంపెనీ ఆదాయం కేవలం రూ.10,930.6 కోట్లుగా ఉంది.

కంపెనీ బోర్డు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.5 ఫైనల్ డివిడెండ్ అందించాలని ప్రకటించింది. నిర్వహణ స్థాయిలో EBITDA గత ఆర్థిక సంవత్సరం రూ.2,802 కోట్ల నుంచి 8.3 శాతం పెరిగి ప్రస్తుతం ముగిసిన జనవరి-మార్చి త్రైమాసిక కాలంలో రూ.3,034 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో EBITDA మార్జిన్ గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 25.6 నుంచి స్వల్పంగా తగ్గి 25.3 శాతానికి చేరుకుంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెండు వ్యాపారాలు వార్షిక అమ్మకాల్లో 1 బిలియన్ డాలర్లను అధిగమించాయని కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ షాంఘ్వి తెలిపారు. కీలక మార్కెట్లలో ఈ క్రిటికల్ మాస్ సాధించడం ఆయా బృందాలు అనేక సంవత్సరాల పాటు పడిన శ్రమకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
కంపెనీ తన స్పెషాలిటీ పోర్ట్‌ఫోలియోను నిర్మించడం కొనసాగిస్తుందని, వ్యాపారాల్లో స్థాయిని పొందేందుకు మరింత పెట్టుబడి పెడతామని దిలీప్ షాంఘ్వి ఫలితాలపై స్పందిస్తూ పేర్కొన్నారు. అయితే నేడు మార్కెట్లు ముగిసే సమయానికి మార్కెట్లలో సన్ ఫార్మా కంపెనీ షేర్లు స్వల్పంగా నష్టంతో ఒక్కోటి రూ.1,539.30 వద్ద స్థిరపడ్డాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications