ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 2,023 కోట్ల నుంచి 40 శాతం పెరిగి రూ. 2,836 కోట్లకు చేరుకుంది. ఈ ఫలితాలు అంచనాలను అధిగమించాయి. ఔషధ తయారీ సంస్థ ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఆదాయం 6 శాతం పెరిగింది. ఆదాయం గత ఏడాది రూ.11,941 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.12,653 కోట్లకు చేరుకుంది.
మొదటి త్రైమాసిక నికర లాభం సంవత్సరానికి దాదాపు 21 శాతం పెరిగింది. "గత సంవత్సరం ఫస్ట్ త్రైమాసికంలో కంపెనీరూ. 143 కోట్లతో వివాల్డిస్ హెల్త్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 60 శాతం వాటాను కొనుగోలు చేసింది. కాబట్టి గత సంవత్సరం త్రైమాసిక ఫలితాలు ఈ సంవత్సర త్రైమాసి ఫలితాలను పోల్చలేమని" అని సన్ ఫార్మా ఆర్థిక నివేదికకు సంబంధించిన నోట్‌లలో పేర్కొంది.

సన్ ఫార్మా ఇండియా ఫార్ములేషన్ అమ్మకాలు 16.4 శాతం పెరిగి రూ. 4,144 కోట్లకు చేరాయి. ఇది మొత్తం ఏకీకృత అమ్మకాలలో 33.1 శాతం వాటాను కలిగి ఉంది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆరు కొత్త ఉత్పత్తులను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. US ఫార్ములేషన్ అమ్మకాలు సంవత్సరానికి 1 శాతం తగ్గి $466 మిలియన్లకు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పటికీ మొత్తం ఏకీకృత అమ్మకాలలో 31.1 శాతానికి పైగా ఉన్నాయి.
గ్లోబల్ స్పెషాలిటీ అమ్మకాలు 14.7 శాతం పెరిగి $266 మిలియన్లకు చేరాయి. మొత్తం అమ్మకాల్లో ఇది 17.7 శాతం. ఎమర్జింగ్ మార్కెట్ల ఫార్ములేషన్ అమ్మకాలు 8.8 శాతం పెరిగి $284 మిలియన్లకు చేరుకున్నాయి. Q1 FY24లో రూ.680 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో పరిశోధన, అభివృద్ధి పెట్టుబడులు రూ.794 కోట్లకు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో EBITDA ఇతర నిర్వహణ రాబడులతో కలిపి 8.3 శాతం పెరిగి రూ.3,608 కోట్లకు చేరుకుందని సన్ ఫార్మా వివరించింది.


Click it and Unblock the Notifications