Sun Petrochemicals: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా అనేక కొత్త పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి వేలకోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ.. కొత్త ఉపాధి అవకాశాలను ఇక్కడి యువతకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఈ క్రమంలోనే సన్ పెట్రోకెమికల్స్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. కంపెనీ తెలంగాణలో మూడు చోట్ల పంప్డ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పటానికి ముందుకొచ్చింది. ఇవి సంయుక్తంగా 3400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి దోహదపడతాయని కంపెనీ పేర్కొంది. ఇందుకోసం తెలంగాణలో రూ.45,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తాజా ఎంఓయూ ప్రకారం వెల్లడైంది. ఈ ప్రాజెక్టులను నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది.

దావోస్ వేదికగా కుదిరిన తాజా ఒప్పందం తెలంగాణంలో కొత్తంగా 7000 మందికి ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ప్రాజెక్టులు 3,400 మెగావాట్ల మొత్తం సామర్థ్యాన్ని కలిగి ఉంటయని, 5,440 మెగావాట్ల సామర్థ్యంతో దిగువన ఉన్న ఇంటిగ్రేటెడ్ సౌర విద్యుత్ ప్లాంట్లతో అనుబంధంగా ఉంటాయని కంపెనీ పేర్కొంది. ప్రాజెక్టు ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీ వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం, ఏటా పెరుగుతున్న ఇంధన డిమాండ్లను పరిష్కరించడం లక్ష్యంగా ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ వైపు వేస్తున్న అడుగులకు మద్ధతు ఇవ్వటం దీని లక్ష్యంలో భాగంగా ఉంది.
2014 నుంచి తెలంగాణకు అతిపెద్ద పెట్టుబడి విజయాల్లో ఒకటిగా తీసుకురావడానికి ముఖ్యమంత్రితో పాటు తాను, అధికారులు, సన్ పెట్రోకెమికల్స్ అగ్ర నాయకత్వంతో కలిసి అనేక రౌండ్ల చర్చలు జరిపినట్లు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో గత 12 నెలలుగా తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా తిరుగులేని శక్తిగా అవతరిస్తోందని సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, సన్ పెట్రోకెమికల్స్ ఎండీ దిలీప్ షాంఘ్వి అన్నారు. తాజా ఒప్పందాన్ని ఒక పెద్ద మైలురాయిగా అభివర్ణించారు.
Major milestone for #Telangana. The Government of Telangana has entered into an MoU with Sun Petrochemicals, a leading energy company to develop 3 Pumped Storage Hydro Power projects in Nagarkurnool, Mancherial, and Mulugu districts, totalling a massive 3,400 MW capacity.… pic.twitter.com/8IJWvOhjby
— Telangana CMO (@TelanganaCMO) January 22, 2025
తాజాగా దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం, సన్ పెట్రోకెమికల్స్ సీనియర్ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం పెట్టుబడులపై కుదిరింది. ఇది సుస్థిర ఇంధన అభివృద్ధి దిశగా తెలంగాణ డ్రైవ్‌లో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పైగా ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనతో పాటు మూడు జిల్లాల్లో పరోక్షంగా అనేక ఉపాధి అవకాశాలను ఇది కల్పిస్తుందని వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications