SSY: సుకన్య సమృద్ధి యోజన పథకం ముగ్గురు ఆడపిల్లలున్నా వర్తిస్తుంది.. కానీ..!
ఆడ పిల్లల కోసం ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం తీసుకొచ్చింది. సుకన్య సమృద్ధి ఖాతాను 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలిక కోసం తల్లిదండ్రులు
తెరవవచ్చు. ఈ పథకం ఒక కుటుంబానికి ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. కానీ ముగ్గురు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ప్రభుత్వం పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా మూడో ఖాతాను కూడా తెరవవచ్చు.

కండిషన్స్
మొదటి ప్రసవ సమయంలో కవలలు, రెండో ప్రసవ సమయంలో మరో ఆడపిల్లలు పుడితే మూడో ఆడపిల్లకు సుకన్య సమృద్ధి ఖాతా తెరవవచ్చని ప్రభుత్వం తెలిపింది. అలాగే మొదటి ప్రసవంలో ఆడపిల్ల పిట్టి.. రెండు ప్రసవంలో ముగ్గురు ఆడ పిల్లలు పుట్టిన వారు కూడా సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవొచ్చు.

7.6 శాతం
SSY పథకం 7.6 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తున్నారు. స్కీమ్ నుంచి వచ్చే వడ్డీ ఆదాయం ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ -10 ప్రకారం మినహాయింపు ఉంటుంది. అలాగే, స్కీమ్‌లో చేసిన పెట్టుబడి చట్టంలోని సెక్షన్ 80-సి కింద మినహాయింపుకు అర్హత పొందుతుంది. కనిష్ట పెట్టుబడి మొత్తం విషయానికి వస్తే, 15 సంవత్సరాల కాలానికి ఖాతాలో సంవత్సరానికి రూ. 250, గరిష్టంగా రూ. 1,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్ 21 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది.

21 సంవత్సరాలు
ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఖాతా మెచ్యూరిటీని పొందుతుంది.
ఉన్నత విద్య, వివాహం కోసం ఖాతాదారు ఆర్థిక అవసరాలను తీర్చడానికి, ఖాతాదారుడు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత పాక్షిక ఉపసంహరణ సౌకర్యాన్ని కల్పించారు.


Click it and Unblock the Notifications