Market News: ఇథనాల్ తయారీపై కేంద్రం స్వీట్ డెసిషన్.. ఆ స్టాక్స్‌లో భారీ ర్యాలీ

Sugar stocks: ఇవాళ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు క్రమేపీ గ్రీన్‌ లోకి మారాయి. ఇవాళ ర్యాలీని చక్కెర స్టాక్స్ ముందుండి నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు కారణం కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయమని అర్థమవుతోంది.

ఇథనాల్ ఉత్పత్తి చేసేందుకు చెరకు రసాన్ని ఉపయోగించకూడదని కేంద్రం గతంలో నిషేధం విధించింది. కాగా ఇప్పుడు ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. దీంతో ఇవాళ షుగర్ స్టాక్స్ 10 శాతానికి పైగా పెరిగాయి. పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తి కోసం చెరకు రసం మరియు మొలాసిస్ రెండింటి వినియోగాన్ని అనుమతించడమ ద్వారా ఈ భారీ ర్యాలీ నమోదైనట్లు తెలుస్తోంది.

Sugar stocks leading markets on government decision

ఈ రంగంలోని ప్రముఖ ప్లేయర్స్ బలరాంపూర్ చినీ మిల్స్ మరియు శ్రీ రేణుకా షుగర్స్ వంటి కీలక సంస్థల స్టాక్స్ ప్రైస్ దాదాపు 7.5 శాతం పెరిగాయి. దాల్మియా భారత్ షుగర్ 6.5 శాతం, త్రివేణి ఇంజినీరింగ్ మరియు EID-Parry (ఇండియా) కూడా ఈ ర్యాలీలో భాగమయ్యాయి. ఇవి దాదాపు 5 శాతం మేర లాభాలను నమోదు చేశాయి.

బజాజ్ హిందుస్థాన్ షుగర్ 9.22 శాతం, ధంపూర్ షుగర్ మిల్స్ షేర్లు 8.22 శాతం, ద్వారికేష్ షుగర్ ఇండస్ట్రీస్ స్టాక్ 6.39 శాతం భారతీయ సర్కోజ్ 10.65 శాతం, మగద్ షుగర్ & ఎనర్జీ లిమిటెడ్ 6.56 శాతం లాభపడ్డాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం చక్కెర ఉత్పత్తికి మరింత సౌలభ్యాన్ని అందిచే కీలక చర్యగా బల్‌రామ్‌పూర్ చినీ మిల్స్ MD వివేక్ సరయోగి అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+