Sugar Price: పెరుగుతున్న చక్కెర ధరలు.. బాంబు పేల్చనున్న కేంద్ర ప్రభుత్వం..!!
Sugar Price: దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా చక్కెర్ ధరలు పెరగటం ప్రారంభించాయి. ఈ క్రమంలో ఆరేళ్ల గరిష్ఠానికి వాటి ధరలు చేరుకున్నాయి. ఇది నిజంగా చేదు వార్త.
ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ ప్రారంభం అవుతోంది. ఈ సమయంలో సాధారణ సమయం కంటే అధికండా డిమాండ్ ఉంటుంది. అయితే పెరుగనున్న డిమాండ్ కు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే నిల్వలను నిర్వహిస్తోంది. రానున్న నెలలో పెరగే డిమాండ్ తీర్చేందుకు సరిపోయేందు కేంద్రం తగిన నిల్వలను కలిగి ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించవచ్చని తెలుస్తోంది.

ద్రవ్యోల్బణం, తగ్గిన ఉత్పత్తి వంటి కారణాలతో ఇప్పటికే భారత్ బియ్యం, గోధుమలు, ఉల్లి వంటి పంటల ఎగుమతిని నిరుత్సాహ పరుస్తోంది. ఇందుకోసం అధిక ఎగుమతి సుంఖాలను విధిస్తోంది. ఈ జాబితాలో ప్రస్తుతం చక్కెర సైతం చేరిపోతోంది. అక్టోబర్ 1 నుంచి మెుదలు కానున్న కొత్త పంట సీజన్లో చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించి, లిమిట్ తగ్గించే యోచనలో కేంద్రం ఉంది. దేశంలోని 90 శాతం ఉత్పత్తైన చక్కెర వాణిజ్య ఆహార ఉత్పత్తులకు వెళుతుండగా.. 10 శాతం కంటే తక్కువ గృహ వినియోగానికి వెళుతోంది.
ఇలాంటి తరుణంతో ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం చక్కెరపై స్టాక్ పరిమితి విధించటాన్ని పరిశీలిస్తోంది. తద్వారా అక్రమ నిల్వలను అడ్డుకుని మార్కెట్లో కృత్రిమ ధరల పెరుగుదలను అడ్డుకోవాలని చూస్తోంది. దీనికి సంబంధించిన నిర్ణయం వచ్చేవారం వెలువడే అవకాశం ఉంది. 2016లో చివరి సారి చక్కెరపై స్టాక్ పరిమితిని కేంద్ర ప్రభుత్వం విధించింది. ఇటీవలి ధరల పెరుగుదలపై ప్రభుత్వ అసంతృప్తిని ఆహార కార్యదర్శి చక్కెర మిల్లులకు తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే మిల్లులు అధిక దేశీయ కోటాను ఆఫర్ చేశాయి.


Click it and Unblock the Notifications