ధనవంతులు, సంపన్నుల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టయిల్ కాస్త ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అయితే ఎంత సంపాదించిన లేదా ఎంత సంపాదన ఉన్నసరే ఇప్పటికి కొందరు సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. మన దేశంలో అత్యంత ధనవంతుల మహిళల పేర్లు చూస్తే అందులో సుధా మూర్తి అనే పేరు తప్పక ఉంటుంది. సుధా మూర్తి సింప్లిసిటీకి, సామాజిక సేవలకు ఫెమస్. కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఇప్పటికే ఆమె సాధారణంగానే ఉంటుంది. ఆమె వయస్సు 74. సుధా మూర్తి దంపతులు ఇద్దరు కూడా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు... అవును, మీరు సుధా మూర్తిని చూసి, ఆమె ఒక ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్త భార్యా అని, ఆమె అల్లుడు ఒక దేశ ప్రధానమంత్రి అని ఎవరూ చెప్పలేరు. అంతే కాదు ఆమె రాజ్యసభ సభ్యురాలు కూడా. ఒక మాటలో చెప్పాలంటే ఆమె ఇప్పటికి ఆకర్షణీయమైన రంగుల ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు.

సుధా మూర్తి ఆస్తులు రూ.36,690 కోట్లు, కానీ ఆమె సింపుల్ లైఫ్ గడపడానికి ఇష్టపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుధా మూర్తి గత 30 సంవత్సరాలలో సొంత డబ్బుతో ఒక్క చీర కూడా కొనకపోవడం. 775 కోట్ల నికర విలువకు అధినేత అయిన సుధా మూర్తి, ఏ పెద్ద ఈవెంట్‌లోనైనా సాధారణ చీరలోనే కనిపిస్తారు.
ఆ ఒక్క నిర్ణయంతో ఒక్క చీర కూడా కొనలేదు : DNA నివేదిక ప్రకారం, కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ సుధా మూర్తి మూడు దశాబ్దాలుగా ఒక్క కొత్త చీర కూడా కొనలేదు. ఇది మీకు ఆశ్చర్యకరంగా ఉండోచ్చు. అయితే దీని వెనుక ఒక ఆధ్యాత్మిక నమ్మకం ఉందని సుధా మూర్తి వాదిస్తున్నారు. నిజానికి ఆమె కాశీ వెళ్ళినపుడు ఆమె తనకు ఇష్టమైనదాన్ని వదిలి వెళ్లాలని అనుకుంది. ఆమెకు చీరలంటే చాలా ఇష్టం, అప్పటి నుండి ఆమె కొత్త చీరలు కొనలేదని సమాచారం. కాశీకి వెళ్ళినప్పుడు సుధా మూర్తి తనకు ఇష్టమైన వస్తువును విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని జీవితంలో ధైర్యం, వినయానికి చిహ్నంగా తీసుకుంది. సుధా మూర్తి తన జీవితంలో సింప్లిసిటీ, ఆధ్యాత్మిక సూత్రాలకు విలువ ఇస్తుంది. ప్రపంచంలో మనకి దూరమైన వస్తువులు, సంపద నిజమైన ఆనందాన్ని తీసుకురాలేవు అని ఒక సందర్భాల్లో ఆమె అన్నారు.
ఎన్.ఆర్. నారాయణ మూర్తి: సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌కు మరో సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల లిస్టులో 69వ స్థానంలో ఉన్నారు. అతని మొత్తం సంపద $5.2 బిలియన్లు. 1981 నుండి 2002 వరకు అంటే 21 ఏళ్ళు ఇన్ఫోసిస్ CEOగా ఉన్నారు. నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల కుమార్తె అక్షత బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్‌ను వివాహం చేసుకుంది.
మహా కుంభమేళాలో సుధా మూర్తి: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు, సాధువులు, నాగ సాధువులు, విదేశీ భక్తులు, అలాగే దేశ విదేశాల నుండి ప్రముఖులు హాజరయ్యారు. అలాగే రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధా మూర్తి కూడా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించారు. సుధా మూర్తి హవేరి జిల్లాలోని షిగ్గావ్లో జన్మించారు.
సుధా మూర్తికి డాక్టరేట్: మైసూర్ విశ్వవిద్యాలయం 105వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమంలో సుధా మూర్తి సేవలకు గుర్తింపుగా ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. జీవితంలో చాలా సింపుల్ లైఫ్ గడపడం కొంతమందిని చూసి ఎలా నేర్చుకోవచ్చో చెప్పడానికి ఆమె ఒక మంచి ఉదాహరణ. సుధా మూర్తి 2023లో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో సత్కరించారు. స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత సుధా మూర్తి హుబ్బళ్లిలోని బివిబి ఇంజనీరింగ్ కళాశాల నుండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసారు. టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ (టెల్కో)లో పనిచేసిన మొదటి మహిళా ఇంజనీర్ ఆమె. తరువాత ఆమె నారాయణ మూర్తిని వివాహం చేసుకున్నాక, మరికొంతమందితో కలిసి ఇన్ఫోసిస్‌ను ప్రారంభించింది. తాజాగా రాజ్యసభలో ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నీరు కావాల్సి వస్తే కూడా ఆమెనే స్వయంగా అందించారు.
సుధా మూర్తి ఎన్నో ట్రావెల్ లాగ్స్ ఇంకా నాన్-ఫిక్షన్ పుస్తకాలు ప్రచురించారు. ఆమె పుస్తకాలు చాల భాషలలోకి కూడా అనువదించారు. ఇంకా ఆమె చాల కన్నడ అండ్ ఇంగ్లీష్ వార్తాపత్రికలలో కాలమిస్ట్ కూడా. ఆమె 'సుధ అమ్మ' అనే పిల్లల కోసం యానిమేటెడ్ సిరీస్ కూడా నిర్వహించింది. సుమారు $250 మూలధనంతో కలగా ప్రారంభమైన ఈ సంస్థ నేడు దాదాపు $80 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా అవతరించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుధా మూర్తి గారిని రాజ్యసభకు నామినేట్ చేయడం నాకు గొప్ప విషయం. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా వివిధ రంగాలకు సుధా మూర్తి అందించిన సేవలు అపారమైనవి ఇంకా స్ఫూర్తిదాయకమైనవి. రాజ్యసభలో ఆమె ఉనికి మన 'నారీ శక్తి'కి శక్తివంతమైన నిదర్శనం, సుధా మూర్తి సేవలు ఇంకా ఆమె కృషి మన దేశ భవిష్యత్తును రూపొందించడంలో మహిళల బలం అండ్ సామర్థ్యాన్ని వివరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ Xలో షేర్ చేసారు.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధా మూర్తి మాట్లాడుతూ, 'మేము కర్ణాటక నుండి వచ్చాము. దేవుని ఆశీస్సులతో ఈరోజు మహా కుంభమేళాలో పాల్గొనే అవకాశం మాకు లభించింది. మా పూర్వీకులకు ఇక్కడికి రావాలని కోరిక ఉండేది. కానీ ఆలా జరగలేదు. కాబట్టి నేను మూడు రోజులు ఇక్కడే ఉండి త్రివేణి సంగమంలో స్నానం చేసి వారి పేరు మీద తర్పణం సమర్పిస్తాను" అని ఆమె అన్నారు. తాజాగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అతని కుటుంబ సభ్యుల సంపదలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇన్ఫోసిస్ షేర్ల ధరలలో తగ్గుదల కారణంగా నారాయణ మూర్తి అతని కుటుంబం రూ.6,875 కోట్ల సంపదను కోల్పోయింది. సమాచారం ప్రకారం మార్చి 12న ఇన్ఫోసిస్ షేర్ ధరలు రూ.71.55 (4.31%) తగ్గి రూ.1,590.05 వద్ద ముగిశాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications