MEIL Group: మెగా ఇంజనీరింగ్ కంపెనీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు అనటం అతిశయోక్తి కాదు. కాళేశ్వరం ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టిన సంస్థ ఇది.

ఇటీవల దుబాయ్‌లో జరిగిన పవర్ ప్యాక్డ్ 20వ ఆసియా-ఆఫ్రికా బిజినెస్ అండ్ సోషల్ ఫోరమ్‌లో హైదరాబాద్‌కు చెందిన బిలియనీర్ పరోపకారి, వ్యాపార ప్రముఖురాలు, MEIL గ్రూప్‌కు చెందిన సుధా రెడ్డి అద్భుతమైన ప్రదర్శన చేశారు. వ్యాపార, దాతృత్వం విషయంలో ఆమె చేసిన ఆదర్శప్రాయమైన కృషికి 2023 సంవత్సరపు ఉమెన్ పయనీర్ అవార్డుతో సత్కరించబడ్డారు. అదే ఫౌండేషన్ ద్వారా 2020-21 మహిళా సాధికారత సూత్రాల లీడర్‌షిప్ అవార్డును పొందడం ఆమె రెండవ విజయాన్ని సూచిస్తోంది.

గ్లోబల్ గాదర్‌కి షేక్ అల్హాసన్ బిన్ అలీ అల్-నుయిమి, సభ్యుడు, అజ్మాన్ పాలకుల కుటుంబం వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. మిస్టర్ జమాల్ బిన్ సైఫ్ అల్జర్వాన్, సెక్రటరీ జనరల్, ది UAE ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కౌన్సిల్, Mr. ఫహద్ అల్ గెర్గావి, డాక్టర్ అమన్ పూరి, మిస్టర్ వీందర్ సెహ్వాగ్ తో పాటు ఇతరులు ఉన్నారు. UAE, దుబాయ్ ప్రభుత్వ అధికారులు,వ్యాపార యజమానులు, పెట్టుబడిదారులు.. ఆసియా, గల్ఫ్, ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన నిపుణులను ఫోరమ్ ఒకే వేధికపైకి తీసుకొచ్చింది.


Click it and Unblock the Notifications