Sudha Murthy: భర్తను వెనకేసుకొచ్చిన సుధా మూర్తి.. ఏమన్నారంటే..??
Narayana Murthy: దేశంలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అంటే తెలియని వారు ఉండరు అనటం అతిశయోక్తి కాదు. ప్రఖ్యాత టాప్ ఐటీ సేవల కంపెనీని స్థాపించటంలో ఆయన కృషి ఎక్కువగానే ఉంది.
అయితే తాజాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. దేశం వేగంగా ముందుకు ఎదగాలంటే యువత వారంలో కనీసం 70 గంటల పాటు పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం ఇది పెద్ద దుమారం లేపుతోంది. వ్యాపార వర్గాలు, స్టార్టప్ వ్యవస్థాపకులు మూర్తి మాటలతో ఏకీభవిస్తుండగా.. చాలా మంది మాత్రం బతికేది కొంత కాలమే.. గొడ్డు చాకిరీ చేసే కంటే సుఖంగా జీవిచటం కూడా ముఖ్యమేనంటూ తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.

అయితే ఈ వివాదంపై తాజాగా నారాణ మూర్తి భార్య సుధా మూర్తి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నారాయణమూర్తి వారానికి 80 నుంచి 90 గంటల పాటు పనిచేస్తారని సుధా తెలిపారు. అందుల్ల ఆయనకు అంత కంటే తక్కువ పనిచేయటం గురించి తెలియదని ఆమె అన్నారు. నారాయణమూర్తి నిజమైన కష్టాన్ని నమ్ముతారని, ఆయన అలాగే జీవించారని తనకు అనిపించిందని చెప్పారు. వీరిద్దరికీ వివాహం జరిగి దాదాపు 45 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇన్నేళ్లుగా సుధామూర్తి.. నారాయణ మూర్తికి అన్ని విషయాల్లోనూ అండగా నిలుస్తున్నారు.
నేటి కార్పోరేట్ ప్రపంచం అనేక రకాలుగా మారిందని, ప్రజలు తమ భావాలను చాలా రకాలుగా వ్యక్తం చేస్తారని తనతో చెప్పినట్లు సుధా మూర్తి అన్నారు. ఇన్ఫోసిస్ ప్రారంభ సమయంలో సుధా మూర్తి తాను పొదుపు చేసుకున్న రూ.10,000 పెట్టుబడికోసం అందించారు. అలా భర్త, పిల్లల కోసం తన ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పటి నుంచి ఇన్ఫోసిస్ అభివృద్ధిలో పరోక్షంగా పాలుపంచుకున్నారు.


Click it and Unblock the Notifications