Sudha Murty: బెంగుళూరులోని మనీకంట్రోల్ స్టార్టప్ కాన్క్లేవ్ 2023లో సుధా మూర్తి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడారు. విజయవంతమైన వ్యాపారవేత్తకు భార్యగా ఉండటం అంత సులువు కాదని ఆమె పేర్కొన్నారు.
భర్తల విజయవంతమైన ప్రయాణంలో మద్ధతుగా నిలుస్తున్న వ్యాపారవేత్తల భార్యలను ప్రశంశించారు. ఆటుపోట్లను తట్టుకుని ముందుకు సాగటానికి వెన్నుగా నిలిచేవారని అన్నారు. విజయవంతమైన వ్యక్తులు ఇంట్లో కంటే ఎక్కువగా కంపెనీలో గడిపేందుకు ఇష్టపడేవారని తెలిపారు. అందువల్ల వారితో వ్యవహరించటం అంత సులువైన ప్రక్రియ కాదని అన్నారు.

విజయవంతమైన వ్యాపారవేత్తల భార్యలు ఒకేసారి అనేక పాత్రలను నిర్వహించాల్సి ఉంటుందని సుధామూర్తి అన్నారు. భార్య, సెక్రటరీ, ఫైనాన్స్ మేనేజర్, కేర్ టేకర్ గా, అడ్వైడర్ పాత్రలను ఏకకాలంలో నిర్వహిస్తుంటారని అన్నారు. వీటిలో ఏ ఒక్క పనిని చక్కబెట్టడంలో ఫెయిల్ అయినా భర్తలు ప్రతికూలంగా ప్రభావితం అవుతారని వెల్లడించారు. పూర్వ కాలంలో కార్పొరేట్ ప్రపంచంలో బలమైన సంస్థగా మారే క్రమంలో వ్యాపారులు తమ జీవితాన్ని, ఆకాంక్షలను పూర్తిగా కంపెనీకి అంకితం చేసేవారన్నారు.

ఇన్ని త్యాగాలు చేసినప్పటికీ స్త్రీలు పురుషుల కంటే బలంగా ఉండాలని సుధా మూర్తి సూచించారు. మరింత విజయవంతమైన వ్యక్తితో వ్యవహరించడం చాలా కష్టమని యువ పారిశ్రామికవేత్తలందరికీ చెప్పాలనుకుంటున్నట్లు వెల్లడించారు. దీనికి ముందు మాట్లాడిన నారాయణమూర్తి తన భార్య మద్దతుతో జీవితంలో ముందుకు సాగిన విధానాన్ని గుర్తుచేసుకున్నారు. 1976 ఆగస్టు 19న ఆమె పుట్టినరోజున నేను రాజీనామా చేసినప్పుడు.. ముందుగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి.. ఆ తర్వాత రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తనకు జీవితంలో భార్య మద్ధతు లభించినందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నానన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications