Infosys News: ఒకప్పుడు మహిళలకు జీవితంలో ముందుకు వెళ్లేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. సామాజిక ధోరణుల కారణంగా వారు విద్యకు చాలా దూరంగా ఉండేవారు. అనేక ఆంక్షలు సైతం ఉండేవి.
కానీ ఇంజినీరింగ్ పూర్తి చేసి టాటా మోటార్స్ కంపెనీలో పనిచేసిన సుధామూర్తి.. మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. మధ్య తరగతి జీవితాన్ని ఎక్కువగా ఆస్వాధించటానికి ఇష్టపడే ఆమె చాలా మంది మధ్యతరగతి ప్రజల కలలను నెరవేర్చుకునేందుకు పరోక్షంగా కారణమయ్యారు.

1960 దశకం చివర్లో ఆమె చదువుకున్న యూనివర్సిటీలో సుధా మాత్రమే మహిళా విద్యార్థిని. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ స్టెమ్ సెట్‌పై దృష్టి పెట్టడం వల్ల సుధా తన చదువును పురుషాధిక్య సమాజంలో విజయవంతంగా పూర్తి చేశారు. చదువు పూర్తైన తర్వాత ఉద్యోగానికి వెళ్లినప్పుడు తొలిసారిగా సుధామూర్తి.. నారాయణమూర్తిని కలిశారు. వారిద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ ప్రసన్న పరిచయం చేశారు. అలా వారి ప్రేమ వివహం జరిగింది.
సుధా మూర్తి లింగ వివక్షకు గురైన కాలంలో తనకు ఎదురైన అన్ని అడ్డంకులను ఛేదించుకుని స్వతంత్రంగా తన జీవన యాత్రను కొనసాగించారు. ఆ సమయంలో జీవితంలో గొప్పగా సాధించాలని భర్త చేస్తున్న ప్రయత్నాలను నమ్మింది. ఐటీ పరిశ్రమ తొలినాళ్లలో తన అపూర్వమైన మద్ధతును భర్తకు అందించింది. అలా 1981లో నారాయణమూర్తి కొందరు మిత్రులతో కలిసి ఇన్ఫోసిస్ కంపెనీని ప్రారంభించారు.

అయితే ఆ సమయంలో పెట్టుబడికి డబ్బు చాలా అవసరం. భర్త ఆలోచనపై నమ్మకంతో సుధామూర్తి తాను దాచుకున్న రూ.10 వేల సొమ్మును కంపెనీ స్థాపనకు అందించారు. ఆ తర్వాత వచ్చిన సాఫ్ట్‌వేర్ విప్లవంలో నారాయణమూర్తికి చెందిన ఇన్ఫోసిస్ ఐటీ పరిశ్రమలో శిఖరాగ్రానికి చేరుకుంది. దేశంలోని టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
దీని గురించి ఒక ఇంటర్వ్యూలో సుధామూర్తి మాట్లాడుతూ తాను ఇండియాలో అత్తుత్తమ పెట్టుబడిదారుల్లో ఒకరిగా మారానన్నారు. తన భర్త కల నెరవేందుకు తన పెట్టుబడి పునాదిగా మారిందని వ్యాఖ్యానించారు. ఆమె అప్పట్లో పెట్టిన రూ.10 వేల పెట్టుబడి ఇప్పుడు కోట్లుగా మారిపోయింది. అప్పుడు తన వద్ద రూ.10 వేలు లేకుంటే ఇన్ఫోసిస్ ఉండేది కాదని సుధామూర్తి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. నారాయణమూర్తి ఆలోచనను నమ్మి అప్పట్లో ఎవరూ డబ్బులు ఇవ్వలేదన్నది వాస్తవం. కానీ ఆయన ముందుచూపు నేడు అనేక లక్షల మందికి ఉపాధిని కల్పిస్తూ దేశాన్ని ముందుకు నడిపించటంలో దోహదపడుతోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications