సుదీప్ కున్నుమల్ CHROగా… టీసీఎస్‌లో వచ్చే పెద్ద మార్పులు ఏమిటో చూడాలి!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో టాప్ మేనేజ్‌మెంట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. కంపెనీ సీనియర్ లీడర్ మిలింద్ లక్కడ్ రిటైర్మెంట్ తీసుకోగా, ఆయన స్థానంలో "సుదీప్ కున్నుమల్" కొత్త చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ CHRO గా బాధ్యతలు చేపట్టారు. ఈ మార్పు అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఇది అకస్మాత్తుగా వచ్చిన నిర్ణయం కాదు. ఇప్పటికే ఈ ఏడాది "మార్చి 14, 2025" న టీసీఎస్ ఆయనను CHRO డిజిగ్నేట్‌గా ప్రకటించింది.
సుదీప్ కున్నుమల్ టీసీఎస్‌లో 2000 సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు. కున్నుమల్ మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ప్రస్తుతం ఆయన BFSI (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు & బీమా) వెర్టికల్‌లో హెచ్‌ఆర్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ విభాగం ఒక్కదానికే టీసీఎస్ ఆదాయంలో "35-40% వాటా" ఉంది.

కున్నుమల్ గత 25 ఏళ్లలో ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా-పసిఫిక్ (APAC) ప్రాంతాల్లో హెచ్‌ఆర్ లీడర్‌షిప్ రోల్స్‌లో పని చేశారు. ఉద్యోగుల నియామకం నుంచి, టాలెంట్ డెవలప్‌మెంట్ వరకు మొత్తం లైఫ్‌సైకిల్‌లో ఆయనకు మంచి అనుభవం ఉంది. కంపెనీ మేనేజ్‌మెంట్‌లో మార్పులు, విలీనాలు, కొత్త ఉద్యోగులను ఆన్‌బోర్డ్ చేయడం లాంటి సున్నితమైన విషయాల్లో కున్నుమల్ ముందుండి వ్యవహరించారు.
అదే సమయంలో, టాలెంట్ మేనేజ్‌మెంట్ & లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ రంగాల్లో ఆయన వ్యూహాలు టీసీఎస్‌కి మంచి ఫలితాలు ఇచ్చాయి. ముఖ్యంగా AI ఆధారంగా టాలెంట్ మార్కెట్ ప్లేస్ సొల్యూషన్లు అమలు చేసి BFSI డివిజన్‌లో ఉద్యోగుల వినియోగాన్ని మరింత స్మార్ట్‌గా మార్చారు. దీని వల్ల కంపెనీకి సామర్థ్యం పెరగడం, రిసోర్స్ డిప్లాయ్‌మెంట్ మెరుగుపడడం జరిగింది.
బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీకోసం.. అధిక వడ్డీ రేటుతో..
కున్నుమల్ క్రియేటివిటీకి మరో ఉదాహరణ "కోడ్‌విటా" ప్రోగ్రామింగ్ కాంటెస్ట్. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది స్టూడెంట్లు పాల్గొన్న ఈ పోటీ "గిన్నిస్ వరల్డ్ రికార్డు" సాధించింది. దీనివల్ల టీసీఎస్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ విధానాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లారు. మొత్తానికి, మిలింద్ లక్కడ్ రిటైర్మెంట్‌తో టీసీఎస్ హెచ్‌ఆర్ విభాగంలో ఒక యుగం ముగిసింది. ఇప్పుడు సుదీప్ కున్నుమల్ లాంటి అనుభవజ్ఞుడు, కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లబోతున్నాడు.
టీసీఎస్‌లో హెచ్‌ఆర్ నాయకత్వం మారుతున్నప్పుడు, ఇండస్ట్రీలోని ఇతర పెద్ద కంపెనీల పరిస్థితి కూడా ఆసక్తికరంగానే ఉంది. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ లాంటి ఐటీ దిగ్గజాలు కూడా తమ హెచ్‌ఆర్ పాలసీల్లో కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ఎవరో ఉద్యోగుల స్కిల్ డెవలప్‌మెంట్ పై దృష్టి పెడుతుంటే, మరెవరో డైవర్సిటీ & ఇన్‌క్లూజన్, లేదా వర్క్-ఫ్రమ్-హోమ్ మోడల్స్‌ను బలోపేతం చేస్తున్నారు. కానీ టీసీఎస్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. అంత పెద్ద వర్క్ ఫోర్స్‌ను మేనేజ్ చేయడం, వాళ్లను ఒకే దిశగా నడిపించడం నిజంగా చాలా పెద్ద సవాలే. ఇలాంటి సమయంలో కొత్త CHROగా బాధ్యతలు చేపట్టిన సుదీప్ కున్నుమల్ పై అందరి దృష్టి పడటం సహజం.


Click it and Unblock the Notifications