స్కూలు మానేసి పుట్టగొడుగుల వ్యాపారం.. రూ.18 లక్షలు సంపాదన..ఈ కుర్రాడి కథ చదివారా..

School Boy Turned Mushroom Farmer: జీవితంలో పైకి రావాలంటే ఉద్యోగం, వయసుతో పనేమి ఉండదు. కష్టపడాలనే తాపత్రయం ఉంటే చాలు..మీకున్న తెలివితో ఆలోచన చేస్తే ఆదాయం సంపాదించవచ్చు. ఎలాగంటారా..అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.. ఓ పాఠశాల కుర్రాడు చదువును వదిలేసి వ్యవసాయంలోకి దిగాడు. అతని తండ్రి రైతు కావడంతో ఆ దిశగా నేను కూడా ఎందుకు ప్రయత్నించకూడదనుకున్నాడు.ఆలోచన వచ్చిందే ఆలస్యం తండ్రికి చెప్పి..ఆయనను ఒప్పించి పుట్టగొడుగుల వ్యాపారంలోకి దిగాడు.కట్ చేస్తే ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు. వ్యాపారం పెట్టిన నాలుగేళ్లలోనే రూ. 18 లక్షల టర్నోవర్ సాధిస్తున్నాడు ఈ కుర్రాడు.

కుర్రాడి పేరు.. ప్ర‌భు రంజ‌న్. బీహార్‌ రాజధాని పాట్నాలోని న‌బ‌త్‌పూర్‌ గ్రామానికి చెందినవాడు. చదువులో కొంచెం మెరుగ్గా రాణించినా అతనికి చదవడం అంటే ఇష్టం లేదు. తండ్రి, కుటుంబ సభ్యుల బలవంతంతో ఎలాగోలా పదవతరగతి వరకు నెట్టుకొచ్చాడు. ఆ తరువాత తన లక్ష్యం చదువు కాదని తెలుసుకున్నాడు. తనకు తానుగా కాళ్ల మీద నిలబడాలని నిర్ణయించుకున్నాడు. అయితే పెట్టుబడికి డబ్బులు లేవు. మరి ఏం చేయాలి అనే ఆలోచన చేయడం ప్రారంభించాడు.

Mushroom Farming mushroom farming success story teen entrepreneur India young farmer earns 18 lakh profitable mushroom farming youth startup in agriculture schoolboy mushroom business mushroom cultivation India organic farming ideas agribusiness success teenage farmer story small scale farming profits Indian rural entrepreneurship mushroom farming income 18 Prabhu Ranjan school boy Bihar Gaya School Boy School Boy Turned Mushroom Farmer Prabhu Ranjan

రియల్ ఎస్టేట్ లోకి దిగుతామంటే భారీగా ధనం కావాలి. కాని అతని దగ్గర లేదు. ఈ పరిస్థితుల్లో అతను యూట్యూబ్ వీడియోలు చూసి ఏం చేయాలో తెలుసుకున్నాడు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఎలా సాధించాలనే దానిపై కసరత్తు చేశాడు. యూట్యూబ్ లో ఎక్కువగా అతనిని పుట్టగొడుగుల పెంపకం బాగా ఆకర్షించింది. ఇంకేముందు తన లక్ష్యం పుట్టగొడుగుల పెంపకం అని తెలుసుకున్నాడు. దీని కోసం ఏం చేయాలో తెలుసుకున్నాడు. స్వతహాగా వారి కుటుంబం వరి, గోధుమలు ఎక్కువగా పండించే వారు కావడంతో అతనికి ఇంకా అది ప్లస్ అయింది. ఆ గడ్డితోనే పుట్టగొడుగుల సాగులోకి దిగాడు.

ఇక భూమి కావాలి. బోరు లేకపోవడంతో.. వారి పొలం ఎండిపోయింది. ఆ పొలాన్నే దాన్ని తన వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నాడు. ఇక పుట్టగొడుగుల వ్యాపారానికి సంబంధించిన సరంజామా కొనుగోలు చేయడం ఎలా అని ఆలోచించాడు. తండ్రి ఇచ్చిన 5 వేల రూపాయలను తీసుకుని బీహార్‌లోని గ‌యలో పుట్ట‌గొడుగుల‌ గుడ్లను కొనుగోలు చేశాడు. 2 బస్తాల్లో వాటిని నింపి పెట్టాడు. అవి 30 రోజులు తిరిగేసరికి దిగుబడికి వచ్చాయి. వాటిని స్థానిక మార్కెట్లో కేజీ రూ.150 రూపాయలకు విక్రయించడం ప్రారంభించాడు. మొత్తం 300 కేజీల బ‌ట‌న్ మ‌ష్రూమ్స్‌ను మార్కెట్లో అమ్మకానికి పెట్టాడు. హాట్ కేకుల్లా అవి అమ్ముడుపోయాయి. రూ. 5 వేలు పెట్టుబడి పెడితే అతనికి రూ. 45 వేలు చేతికి వచ్చాయి.

నవంబర్ లో సాగు చేస్తే కేవలం 30 రోజుల్లో అంటే డిసెంబర్ లో చేతికి వచ్చాయి. ఈ సందర్భంగా అతను పుట్టగొడుగులను రెండు రకాలుగా పండించవచ్చని తెలుసుకున్నాడు. ఒక‌టి సీజ‌న్‌లో, మ‌రోక‌టి ఏడాదంతా పండింవచ్చనే అభిప్రాయానికి వచ్చాడు. అయితే అతనికి ఏడాదంతా పుట్టగొడుగుల పెంపకం అంతగా రుచించలేదు. అందుకే సీజన్ ఎంచుకున్నాడు. సీజ‌న్ ప్ర‌కార‌మే పుట్ట‌గొడుగులు పండిస్తూ భారీ లాభాలను ఆర్జిస్తున్నాడు. ఆ తరువాత నుంచి ప్రతి సీజన్ లో అతను గుడ్లను కొని వాటిని 300 బ్యాగుల్లో నింపి సాగు చేస్తున్నాడు. ఇప్పుడు తన వ్యాపారాని ఎక్కువగా విస్తరించాడు.

ప్రస్తుత సీజన్ లో 300 బ్యాగుల నుంచి 1500 బ్యాగుల పుట్టగొడుగుల గుడ్లకి మారాడు. 3 వేల కేజీలకు పైగానే పుట్టగొడుగులను పండిస్తున్నారు. వాటిని మార్కెట్లో విక్రయించడం ద్వారా అతను లక్షల సంపాదన చేతికి తీసుకుంటున్నాడు. ఈ ఏడాది దాదాపు రూ. 18 లక్షల వ్యాపారం జరిగిందని గర్వంగా చెబుతున్నాడు. మొత్తం ఖర్చులు పోగా చేతిలో రూ. 3 లక్షల వరకు మిగులుతుందని ఈ వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలనుకుంటున్నట్లు చెబుతున్నాడు స్కూల్ బాయ్. ఇప్పుడు అతని సంపాదన ఏడాదికి రూ. 10 లక్షలు పై మాటే..

ఇప్పుడు పదవ తరగతిలో ఆగిపోయిన చదువును మళ్లీ కొనసాగిస్తున్నాడు. అలాగే విద్యార్థులకు వ్యవసాయంపై శిక్షణ ఇస్తున్నారు. దటీజ్ ప్ర‌భు రంజ‌న్ సక్సెస్ స్టోరి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+