Motilal Oswal Success: ఈ రోజుల్లో ప్రజలు స్పీడు పెంచారు. ఇంటర్నెట్ అందుబాటులోకి రావటంతో తమ టాలెంట్ దేనిలో ఉన్నా దానిని ప్రపంచానికి తెలియజేస్తూ సొంత వ్యాపారాలను స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఒకప్పుడు ఇవేమీ లేని కాలంలోనే తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టి ప్రస్తుతం సమాజంలో వ్యాపారవేత్తలుగా మారాలనుకుంటున్న లక్షల మంది ఇన్వెస్టర్లకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. వారు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు నేటి యువతగా పాఠాలుగా ఉన్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మోతీలాల్ ఓస్వాల్ సక్సెస్ స్టోరీ గురించే. వాస్తవానికి ఆయన రాజస్థాన్ రాష్ట్రంలో పదురా అనే చిన్న గ్రామానికి చెందిన వ్యక్తి. తండ్రి ధాన్యం వ్యాపారం చేసేవారు. వాస్తవానికి కంఫర్టబుల్ లైఫ్ ఉన్నప్పటికీ తాను ఉన్నత చదువులతో జీవితంలో తన ప్రయాణాన్ని కొత్త మార్గంలో కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మోతీలాల్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా వృత్తిని కొనసాగించడానికి ముంబైకి వెళ్లడానికి ముందు ఫల్నాలోని ఎస్‌పీయూ జైన్ కాలేజీలో చదువుకున్నారు. విశ్వాసంతో చిన్న పట్టణం నుంచి ప్రస్తుతం ఆర్థిక రంగంలో పెద్ద వ్యాపారవేత్తగా ముందుగు సాగుతున్నారు.

అసలు టర్నింగ్ పాయింట్ దీని తర్వాతే వచ్చింది. 1987లో మోతీలాల్ కి రామ్‌డియో అగర్వాల్ పరిచమయ్యారు. ముంబైలో ఒక హాస్టల్ లో నివశిస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అలా వారు తమకు విడివిడిగా ఉన్న నైపుణ్యాలతో వ్యాపార ప్రయాణాన్ని స్టార్ట్ చేసేందుకు పార్ట్నర్ షిప్ ప్రారంభించారు. అది భారతీయ ఫైనాన్స్ రంగంలో పెద్ద విజయాన్ని సాధించి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మోతీలాల్-రామ్‌డియో బీఎస్ఈలో సబ్-బ్రోకర్లుగా పనిచేయటం స్టార్ట్ చేశారు. అలా చాలా తక్కువ కాలంలోనే 1989లో మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ స్థాపించారు. రామ్‌డియో సంస్థలో రీసెర్చ్ అండ్ ఫైనాన్స్‌పై దృష్టిని కొనసాగించగా, మోతీలాల్ ఆపరేషన్స్ అండ్ కస్టమర్ రిలేషన్ షిప్ వంటి విషయాలను చూసుకున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలో అత్యుత్తమ బ్రోకరేజ్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతోంది.
అలా వ్యాపారవేత్తగా సక్సెస్ రుచిచూసిన మోతీలాల్ ఓస్వాల్ సంపద రూ.15,965 కోట్లుగా ఉంది. ఎవరైనా కష్టపడుతూ, ఒక వ్యూహంతో జీవితంలో ముందుకు సాగుతారో వారిని విజయం తప్పకుండా వరిస్తుందని ఈ జర్నీ ప్రతి ఒక్కరికీ తెలియజేస్తోంది. మోతీలాల్ సాధించిన విజయం 2022లో ముంబైలోని ఉన్నత స్థాయి '33 సౌత్' టవర్‌లో రెండు విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేశారు. ముఖేష్ అంబానీకి చెందిన ఐకానిక్ యాంటిలియా బిల్డింగ్ సమీపంలో ఈ టవర్స్ నిర్మించబడ్డాయి. ఇదే క్రమంలో మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ మార్కెట్ విలువ రూ.1.60 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనా వేయబడింది.
More From GoodReturns

Trending: స్కూల్ మానేస్తే రూ. 2.8 కోట్లు ఇస్తామన్నారు.. కానీ, ఈ 16 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడో చూడండి!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications