Layoffs: బీటెక్ కూడా చేయలేదు.. కానీ కోట్లలో సంపాదన! వైరల్ అవుతున్న సామాన్యుడి కెరీర్ జర్నీ!

ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఎక్కడ చూసినా లేఆఫ్స్ (Layoffs) భయం వెంటాడుతోంది. దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో, ఐఐటీ లేదా ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదవని వారికి భవిష్యత్తు ఉంటుందా? అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే, ఒక సాదా సీదా టైర్- 3 కాలేజీలో చదివిన వ్యక్తి, కేవలం తొమ్మిదేళ్లలో తన వార్షిక ఆదాయాన్ని రూ. 1.84 లక్షల నుంచి రూ. 75 లక్షలకు పెంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన సక్సెస్ స్టోరీని రెడ్డిట్ (Reddit) వేదికగా పంచుకుంటూ, కెరీర్ ఎదుగుదలపై విలువైన పాఠాలను నేర్పించాడు.

Success story of man earning 75 LPA without IIT degree despite layoffs and starting career from Tier 3 college

జీరో నుంచి హీరో వరకు: ఒక సామాన్యుడి ప్రయాణం

ఈ యువకుడు ఐఐటీలో చదవలేదు, కనీసం బి.టెక్ కూడా చేయలేదు. కేవలం ఒక సాధారణ కాలేజీ నుంచి బి.ఎస్సీ (మ్యాథమెటిక్స్) పూర్తి చేశాడు. కెరీర్ ప్రారంభంలో ఒక సర్వీస్ డెస్క్ ఏజెంట్‌ గా నెలకు రూ. 15 వేల లోపు (వార్షికంగా రూ. 1.84 లక్షలు) జీతంతో ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ సమయంలో అతనికి పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం కూడా లేదు. కానీ, పని చేస్తున్నప్పుడే కమ్యూనికేషన్ స్కిల్స్ , కస్టమర్ హ్యాండ్లింగ్ నేర్చుకుంటూ తన స్థాయిని పెంచుకున్నాడు.

కోవిడ్ సమయం.. కెరీర్ టర్నింగ్ పాయింట్!

నాలుగేళ్ల పాటు అదే వేగంతో పనిచేసిన అతనికి రూ. 4.5 లక్షల జీతం లభించేది. అయితే కోవిడ్ సమయంలో వచ్చిన మార్పులను అతను అవకాశంగా మలుచుకున్నాడు. ఒక బిగ్-4 కంపెనీకి మారడం ద్వారా అతని జీతం రూ. 8 లక్షలకు చేరింది. అక్కడ నుంచి మళ్ళీ ఏడాదిలోపు మరో కంపెనీకి మారి, నెగోషియేషన్ (బేరసారాలు) స్కిల్స్ ఉపయోగించి తన ప్యాకేజీని రూ. 17.4 లక్షలకు పెంచుకున్నాడు. "వచ్చిన మొదటి ఆఫర్‌కే ఓకే చెప్పకండి, మన విలువను మనం నిరూపించుకోవాలి" అని అతను చెబుతున్న మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

లేఆఫ్స్ (Layoffs) శాపం కాదు.. వరం!

అతని కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన సమయం రూ. 42.2 లక్షల ప్యాకేజీతో ఒక స్టార్టప్‌లో పనిచేస్తున్నప్పుడు వచ్చింది. అకస్మాత్తుగా కంపెనీ అతన్ని తొలగించింది (Layoffs). సాధారణంగా ఎవరైనా ఇలాంటి సమయంలో కుంగిపోతారు. కానీ, అతను ఆ నోటీస్ పీరియడ్ సమయాన్ని కొత్త టెక్నాలజీ (DevOps, Cloud, Automation) నేర్చుకోవడానికి కేటాయించాడు. ఇంటర్వ్యూలలో తన నైపుణ్యాన్ని నిరూపించుకుని, ఏకంగా రూ. 75 లక్షల భారీ ప్యాకేజీతో కొత్త ఉద్యోగాన్ని చేజిక్కించుకున్నాడు.

నిరుద్యోగులకు, టెక్ ఉద్యోగులకు హితవు

"డిగ్రీ అనేది మొదటి ఉద్యోగానికి మాత్రమే ఉపయోగపడుతుంది, ఆ తర్వాత మీ ఎదుగుదల మీ నైపుణ్యంపైనే ఆధారపడి ఉంటుంది" అని అతను స్పష్టం చేశాడు. వేరే వాళ్లతో పోల్చుకోకుండా, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ, సరైన సమయంలో కంపెనీలు మారడం వల్లే ఈ స్థాయికి చేరడం సాధ్యమైందని అతను తెలిపాడు. ప్రస్తుతం ఐటీ రంగంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నా, నైపుణ్యం ఉన్నవారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయని ఈ యువకుడి ప్రయాణం నిరూపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+