For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Lady Trader: స్టాక్ మార్కెట్ ను దున్నేస్తున్న లేడీ టెక్కీ.. జాబ్ చేస్తూనే ట్రేడింగ్.. కోట్లు సంపాదించి..

|

Success Story: పశ్చిమ బెంగాల్‌, బుర్ద్వాన్ కు చెందిన కవిత ప్రస్తుతం ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీలో ఐటీ ప్రొఫెషనల్‌గా పూర్తి సమయం పనిచేస్తోంది. స్టాక్ మార్కెట్ పై మక్కువతో ఆమె 11 ఏళ్ల కిందట ట్రేడింగ్ ప్రారంభించింది. కవిత పోర్ట్‌ఫోలియో విలువ రూ.2 కోట్ల కంటే ఎక్కువగానే ఉంది.

స్టాక్ మార్కెట్ ప్రమాదకరం..

స్టాక్ మార్కెట్ ప్రమాదకరం..

ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ తో డబ్బు సంపాదించడానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన, ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటని కవిత అన్నారు. ట్రేడింగ్ ప్రారంభించిన సమయంలో కవిత ఒక ప్రైవేటు కంపెనీలో రూ.30 వేల జీతానికి ఉద్యోగం చేస్తుండేది.

చిన్నతనం నుంచే ఆదాయం కోసం..

చిన్నతనం నుంచే ఆదాయం కోసం..

చిన్న వయస్సు నుంచే పిల్లలకు కవిత ట్యూషన్స్ చెప్పేది. కవిత కాలేజీ రోజుల్లో పార్ట్ టైమ్ టీచింగ్ కూడా చేసేది. అలా.. పూణేలోని ఒక ఐటీ కంపెనీలో మొదటి ఉద్యోగంలో చేరటంతో ఆమె ఉపాధ్యాయ ప్రయాణం ముగిసింది. అప్పుడు అదనపు ఆదాయం గురించి ఉన్న మార్గాలను ఎతుకుతున్న సమయంలో.. తన సహోద్యోగి తనకు స్టాక్ ట్రేడింగ్‌కు పరిచయం చేశారని కవిత చెప్పింది. దీనికి సంబంధించిన సమాచారం పొందటానికి బిజినెస్ పత్రికలు, మ్యాగజైన్‌లను చదివేది.

చిన్న లాభాలతో ప్రారంభించి..

చిన్న లాభాలతో ప్రారంభించి..

ట్రేడింగ్ నేర్చుకున్న కొన్నాళ్లకే ఆమె ప్రారంభ దశలో రోజుకు రూ.200-రూ.400 లాభాన్ని ఆర్జించింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటానికి కవిత అప్పట్లో రూ.3 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంది. లోన్ డాక్యుమెంట్స్ ఇంటికి రావటంతో తల్లిదండ్రులు ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కవిత తెలిపారు. కానీ.. అలా పెట్టిన పెట్టుబడితో స్టాక్ మార్కెట్ భారీగా పెరగటం కారణంగా పోర్ట్‌ఫోలియో సైజు రూ.20 లక్షలకు చేరుకుంది. ఆ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు గర్వపడ్డారు.

ఆప్షన్స్ ట్రేడింగ్ తో నష్టాలు..

ఆప్షన్స్ ట్రేడింగ్ తో నష్టాలు..

2016లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌పై బ్రోకరేజ్ నిర్వహించిన శిక్షణా సెషన్‌లో పొందిన జ్ఞానంతో కవిత ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్ చేయడం ప్రారంభించింది. దీనివల్ల ఆమె తీవ్రంగా నష్టపోయింది. పెద్ద ఇన్వెస్టర్లు ఫాలో అయ్యే టెక్నిక్స్ నేర్చుకుని పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించాలని నిర్ణయించుకుంది.

అప్పుడప్పుడూ ఆప్షన్స్ ట్రేడింగ్..

అప్పుడప్పుడూ ఆప్షన్స్ ట్రేడింగ్..

పొజిషనల్ ట్రేడర్‌గా కొనసాగుతున్న కవిత.. వీక్లీ, మంత్లీ ఆప్షన్‌లలో ట్రేడ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే స్టాక్ మార్కెట్లో ఆమె ఎదుర్కొన్న భారీ నష్టం విలువ రూ.8 లక్షలు. అదే విధంగా కేవలం ఒక్క రోజులో సంపాదించిన అతిపెద్ద లాభం ఇప్పటి వరకు రూ.14 లక్షలని ఆమె చెప్పారు.

కవిత సూచన..

కవిత సూచన..

ప్రస్తుతం చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారని.. అందుకోసం ముందుగా దాని గురించి పూర్తి పరిజ్ఞానం పొందాలని ఆమె అంటున్నారు. మీ దగ్గర రూ.10 లక్షలు ఉండే మెుదట రూ.50 వేలు లేదా రూ.లక్ష మాత్రమే పెట్టుబడిగా పెట్టాలని సూచిస్తున్నారు. చిన్న మెుత్తాలతో ప్రారంభించటం ఉత్తమమైనదని అంటున్నారు.

English summary

Lady Trader: స్టాక్ మార్కెట్ ను దున్నేస్తున్న లేడీ టెక్కీ.. జాబ్ చేస్తూనే ట్రేడింగ్.. కోట్లు సంపాదించి.. | success story of bengali lady techie who earning millions from stock market know details

success story of bengali lady techie who earning millions from stock market know details
Story first published: Monday, September 12, 2022, 10:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X