Success Story: రూ.100 కోట్ల కంపెనీ సృష్టించిన మహిళా టెక్కీ.. రెండు అద్దె కంప్యూటర్లతో..
Success Story: వ్యాపారం ప్రారంభించి విజయం అందుకోవాలని మనలో చాలా మందికి ఉంటుంది. అయితే పశ్చిమ బెంగాల్ లోని బర్ధమాన్‌లో పుట్టి పెరిగిన ఔన్కితా నంది మాత్రం అనేక అడ్డంకుల దాటుకుని వ్యాపారంలో విజయం సాధించింది.
బెంగాలీ మీడియంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఔన్కితా కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడే ఆండ్రాయిడ్ యాప్‌లను అభివృద్ధి చేసి లాభాలకు విక్రయించేది. అలా పట్టుదలతో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. టైర్ 5 పేరుతో డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్‌మెంట్ కంపెనీని ఆమె నిర్మించింది. ప్రస్తుతం ఈ సంస్థ వార్షిక ఆదాయం రూ.100 కోట్లకు చేరుకుంది.

ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం యునైటెడ్ స్టేట్స్‌లోని ఇండియానాలో ఉంది. ఈ కంపెనీలో ప్రస్తుతం 100 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం కంపెనీ దాదాపు 1500 మంది క్లైంట్లను కలిగి ఉంది. ప్రస్తుతం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ పరిసర ప్రాంతంలో కంపెనీకి కార్యాలయం ఉంది. కంపెనీ ప్రస్తుతం సబ్ స్క్రిప్షన్ ప్రాతిపదికన సేవలను అందిస్తూ దానికి డబ్బు వసూలు చేస్తోంది. టైర్ 5 ఇప్పటి వరకు 25 సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను అభివృద్ధి చేసింది.

ఔన్కిత తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. మధ్యతరగతి బెంగాలీ కుటుంబంలో పెరిగి సొంతంగా వ్యాపారం ప్రారంభించటం పెద్ద సాహసంతో కూడుకున్న నిర్ణయం. అయితే ఆమెకు డేటింగ్ యాప్ టిండర్‌లో జిన్ వూగెన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతను అమెరికాలోని ఫ్లోరిడాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సొంత వ్యాపారం ప్రారంభం గురించి ఆలోచనలు పంచుకోగా.. 2015లో కంపెనీని రెండు అద్దె కంప్యూటర్లతో వారిద్దరూ ప్రారంభించారు. అలా ఆరేళ్లు కలిసి పయనించిన వారు 2021లో పెళ్లి చేసుకున్నారు.


Click it and Unblock the Notifications