ఈ రోజుల్లో రెస్టారెంట్లు, స్టాల్స్ అలాగే హోటల్స్, ఇలా రకరకాల స్టయిల్స్ లో వంటలు పరిచయం చేస్తూ చాలనే ఉన్నాయి మన దేశంలో. అయితే కొన్ని మాత్రం జస్ట్ పార్ట్ టైం లేదా మంచి ఆలోచనతో స్టార్ట్ చేసినవి ఫుల్ సక్సెస్ అయితే ఎలా ఉంటుంది. ఇది ఒక చిన్న వయస్సు ఉన్న అమ్మాయి నిమ్మరసం స్టాల్ నుండి సక్సెస్ ఫుల్ పాప్-అప్ రెస్టారెంట్‌గా ఎదిగిన ఒక సక్సెస్ స్టోరీ. కర్ణాటకకు చెందిన రాజు దంపతులు అమెరికాలోని న్యూయార్క్‌లో వాళ్ళ కూతురి కోసం ఒక విజయాన్నే సాధించారు. ఇప్పుడు వాళ్ళు నెలకు $15,000 సంపాదిస్తున్నారు అంటే మన భారత రూపాయి ప్రకారం 12 లక్షలకు పై మాటే. మీకు ఇష్టం, కష్టాలను ఎదుర్కోవాలనే ధైర్యం ఉండి మంచి రుచికరమైన ఫుడ్ తయారు చేయగలిగితే, మీ ఏ చిన్న ఆలోచననైనా పెద్ద సక్సెస్'గా మార్చుకోగలరని వీళ్ళ కథ చూపిస్తుంది. అయితే ఈ స్టోరీ మొదట CNBC మేక్ ఇట్‌లో వచ్చింది.

కూతురి ఆనందం కోసం ఒక స్టాల్ ప్రారంభిస్తే: కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన శ్వేత రాజు అండ్ ఆమె భర్త వెంకట్ రాజు ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. శ్వేత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా, ఆమె భర్త వెంకట్ రియల్ ఎస్టేట్ రంగంలో న్యాయవాది. అతనికి ఆరు సంవత్సరాల చిన్న కుమార్తె కూడా ఉంది. 2021 సంవత్సరంలో తన కుమార్తె మహతి సంతోషం కోసం ఫోర్ట్ గ్రీన్ పార్క్‌లోని గ్రీన్ మార్కెట్ దగ్గర నిమ్మరసం అలాగే మసాలా దోసెల స్టాల్‌ను స్టార్ట్ చేశాడు. నిజానికి, శ్వేతకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. జనాలకు ఆమె వేసే దోసె చాలా నచ్చింది. జనాలు దోసె తిన్న వెంటనే, వారి కళ్ళు వెలిగిపోయాయి. దింతో వేగంగా రాజు కుటుంబం దోసెలకు ఫెమస్ అయ్యింది.
ఒక అవకాశంగా చూసారు : అంతకుముందు, శ్వేత అండ్ వెంకట్ ఇంటి నుండే మసాలా దోస తయారు చేసి తమతో తీసుకెళ్లేవారు. కానీ డిమాండ్ పెరగడంతో అతను ఒక నెల తర్వాత పార్కులో గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేసి, అతను అక్కడే దోసెలు తయారు చేయడం ప్రారంభించాడు. దీని కారణంగా వాళ్ళ దోసెలకు డిమాండ్ మరింత పెరిగింది. సెప్టెంబర్ 2021 నాటికి ప్రతి శనివారం వందలాది మంది కస్టమర్లు లైన్లలో నిలబడటం మొదలు పెట్టారు. దోసెలు రెడీ కావడానికి గంటల తరబడి కూడా వేచి ఉండేవారు. అయితే ఈ దోసె ధర అప్పుడు $10 అంటే మన ఇండియా రూపాయి ప్రకారం రూ.855. రాజు దంపతులు దీనిని ఒక అవకాశంగా భావించి, ఇక ఈ పనిని మరింతగా ముందుకు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అతను ఈ పనిని ఒక పార్కులోని ఒక స్టాల్ నుండి కమర్షియల్ కిచెన్ వరకు ప్రారంభించాడు. ఇప్పుడు, వారు అక్కడే ఫుడ్ కూడా వండుతున్నారు. నేడు బ్రూక్లిన్ కర్రీ ప్రాజెక్ట్ ప్రతి నెలా లంచ్ నిర్వహిస్తుంది. ఇంకా పాప్-అప్ సర్వీస్ కూడా అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు దోసె ధర $1 అంటే రూ.85. వీరు వంటల కోసం ముడి పదార్థాల కోసం వారానికి $700 ఖర్చు చేస్తారు. అంతే కాకుండా నలుగురు పార్ట్ టైమ్ ఉద్యోగులకు కూడా జీతాలు ఇస్తున్నారు. వీటితో పాటు ప్రతి నెలా $3,800 రెంట్ కూడా కట్టాలి. ఇవన్నీపోగా వీళ్ళ ఆదాయం నెలకు $15,000. కష్టపడి పనిచేయడం పక్కన పెడితే, వీళ్ళ ఫుడ్స్ ప్రజలతో కనెక్ట్ అయినందుకు సంతోషంగా ఉన్నారు. "మా స్టాల్‌లో మేము ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను కలుస్తాము. కొందరు మా దోసెల కోసం లైన్‌లో నిలబడి లైఫ్ టైం ఫ్రెండ్స్ అండ్ జీవిత భాగస్వాములను కూడా కలుసుకున్నారు" అని వెంకట్ చెప్పారు.
నేను ఇండియన్ ఫుడ్ చాలా మిస్ అవుతున్నాను: శ్వేత అండ్ వెంకట్ లకు తినడం కేవలం ఒక పని కాదు. భారతదేశ వివిధ ఆహార సంస్కృతిని సృష్టించడానికి ఇది ఒక మార్గం. అతను 2016లో అమెరికా వచ్చాకా భారతీయ ఆహారాన్ని చాలా మిస్ అయ్యాడు. "యుఎస్ లోని అన్ని భారతీయ రెస్టారెంట్లు ఒకే టెస్ట్ తో ఉంటాయి" అని వెంకట్ CNBCతో చెప్పారు. "భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో వెరైటీ టెస్ట్ ఉంటుంది. మేము దానిని చాలా మిస్ అవుతున్నాము." "నేను ఇక్కడికి వచ్చినప్పుడు, కష్టతరమైన విషయం ఒంటరిగా తినడం. భారతదేశంలో అయితే మనమందరం కలిసి తింటాము. నాకు ఏదో మిస్ అవుతున్నట్లు అనిపించింది" అని అతని భార్య చెప్పింది. కాబట్టి, అతను తన ఇంటి దగ్గరి వాళ్ళని టీ ఇంకా బిస్కెట్ల కోసం ఆహ్వానించడం స్టార్ట్ చేసాడు. బ్రూక్లిన్ కర్రీ ప్రాజెక్ట్ ప్రారంభం ఇదేనని వారికీ అప్పుడు తెలియదు.
ఫుల్ టైం రెస్టారెంట్ చేయాలనుకుంటున్నాను: ప్రస్తుతం, వీళ్ళ పాప్-అప్ రెస్టారెంట్ శనివారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంటుంది. రాజు దంపతులు బ్రూక్లిన్ కర్రీ ప్రాజెక్ట్‌ను పూర్తి స్థాయి రెస్టారెంట్‌గా మార్చాలనుకుంటున్నారు. ఇందుకు అతను ప్రజల నుండి డబ్బు సేకరించడానికి ఒక కాంపెయిన్ కూడా ప్రారంభించారు. అంతేకాదు ఒక పర్మనెంట్ ప్రదేశం కోసం చూస్తున్నారు. "మీరు ఆహారాన్ని వండి షేర్ చేస్తున్నప్పుడు, మీరు వాళ్ళ పట్ల కేర్ తీసుకుంటున్నారని చూపిస్తారు" అని శ్వేత చెప్పింది. "ఆహారం ప్రజలను కలుపుతుంది, సంస్కృతులను మిక్స్ చేస్తుంది ఇంకా సమాజాన్ని నిర్మిస్తుంది." అని కూడా అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..



Click it and Unblock the Notifications