అంధుడి అదృష్టాన్ని మార్చేసిన గులాబీలు.. సెక్యూరిటీ గార్డు నుండి క్లినర్ వరకు... నేడు లక్షల్లో సంపాదన..

అదృష్టం ఎవరిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు. కొందరు మంచి ఉన్నతమైన చదువుతో జీవితంలో సెటిల్ అయితే మరికొందరు మంచి స్టార్ట్ ఆప్ లేదా వ్యాపారంతో అదృష్టాన్ని పరీక్షించుకొని సక్సెస్ అవుతున్నారు. అయితే వ్యాపారం చేయడం అనేది కొంత సవాలు అనే చెప్పాలి. ఎందుకంటే వ్యాపారం చేయడానికి కొన్ని కొన్ని అంశాలు, ఆలోచలు ఒకోసారి ఇవి అంచనాలకు మించే తారుమారు అయితే మళ్ళి జీవితంలో కోలుకొని స్థాయికి నెట్టేస్తాయి. కానీ చేసే వ్యాపారానికి కాస్త అదృష్టం తోడైతే ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేదు. ఇందుకు కారణం వ్యాపారం ద్వారా వచ్చే లాభాలు. మనం ఎంతో మంది సక్సెస్ స్టోరీస్, లగ్జరీ లైఫ్ స్టయిల్ ఇలా చాలా చూసే ఉంటాం. కానీ అంధత్వం ఉన్న ఎన్ని కష్టాలు, పరాజయాలు ఉన్న కూడా వాటిని ఎదురుకొని నేడు అందరు కూడా అదరవంతంగా తీసుకొని మరొకరికి చెప్పే స్థాయికి ఎదిగాడు. ఇది ఎక్కడో కాదు మన దేశంలో జరిగిన ఒక జీవిత యువకుడి కథ.

Success Story of a blind person who worked as From security guard to car washer now luck shined with roses earning in lakhs

హర్యానాకు చెందిన రాజేష్ జీవితం కూడా ఎన్నో కష్టాలు, సవాళ్లతో నిండిపోయింది. ఎందుకంటే అతను పుట్టినప్పటి నుండి కంటి చూపు సరిగా లేకపోవడం వల్ల అతనికి పర్మనెంట్ ఉద్యోగం దొరకడం చాలా కష్టమైంది. దింతో అతను సెక్యూరిటీ గార్డుగా, కార్ వాషర్‌గా కూడా పనిచేశాడు. అతని కళ్ళు అతనికి సహకరించక పోవడంతో అదృష్టం అతన్ని ప్రతిసారీ మోసం చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు రాజేష్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి గులాబీలతో వివిధ వస్తువులను తయారు చేసి అమ్ముతున్నాడు. ఈ వ్యాపారం ద్వారా అతను ఏటా లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

కంటి వ్యాధి కారణంగా మందగించిన చూపు: రాజేష్ రెటినిటిస్ పిగ్మెంటోసా అండ్ మాక్యులర్ డీజెనరేషన్ అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ కారణంగా అతని దృశ్య క్షేత్రం అంటే చుపు దూరం మందగించి అంధత్వానికి సమానమైనదిగా పరిగణించబడింది, అయితే చాలా మందికి 180 డిగ్రీల దృశ్య క్షేత్రం ఉంటుంది. దీని కారణంగా అతనికి సాధారణ ఉద్యోగాలు లభించడం చాలా కష్టమైంది. అతను షాపులో టైల్స్ చూపించడం నుండి సెక్యూరిటీ గార్డు ఇంకా కార్ వాషర్ వరకు ఇలా ఎన్నో రకాల పనులు చేశాడు. కానీ 2014 నాటికి ఈ అవకాశాలు కూడా తగ్గడం ప్రారంభించాయి. దింతో అతని సంపాదన జీవనం సాగించడానికే సరిపోయేది.

నెలకు 5 వేల రూపాయలు సంపాదిస్తూ జీవనం: రాజేష్ జీవితం ఎన్నో కష్టాలతో నిండి పోయింది. ఒకప్పుడు నెలకు 5 వేల రూపాయలు సంపాదించగలిగానని ఆయన చెబుతున్నారు. "ఈ డబ్బు ఇంటి ఖర్చులకి సరిపోవడం లేదు, ఎక్కువ డబ్బు కిరాణా సామాను ఇంకా పాల బిల్లులు కట్టడానికే ఖర్చు అయ్యేది. తన పిల్లలు పెన్సిళ్లు, నోట్‌బుక్‌లు అడిగినప్పుడు ఇంకా వాళ్ళ చిన్న చిన్న కోరికలు కూడా తాను తీర్చలేకపోయాను" అని చెబుతున్నాడు.

పువ్వులు తన జీవితాన్ని మార్చాయి: రాజేష్ 10వ తరగతి పూర్తి చేసాడు. 2015 సంవత్సరంలో తాను పూల పెంపకం ప్రారంభించినప్పుడు తన జీవితంలో పెద్ద మార్పు వచ్చిందని చెబుతున్నారు. రాజేష్ బంతి పువ్వులు నాటడం ప్రారంభించి అలాగే పూల మార్కెట్ గురించి తెలుసుకున్నాడు. "నేను బంతి పువ్వుల సాగు ప్రారంభించాను ఎందుకంటే ఇది సులభమైన ఇంకా తక్కువ నష్టం అండ్ ప్రమాదం ఉన్న పంట. దీనితో నాకు త్వరగా లాభాలు వచ్చాయి ఇంకా మార్కెట్ గురించి మంచి అవగాహనా కూడా వచ్చింది" అంటూ చెబుతున్నాడు.

డబ్బుల వర్షం కురిపించిన రోజా పువ్వులు: రాజేష్ బంతి పువ్వుల సాగుతో పాటు, గులాబీ పువ్వుల సాగును కూడా ప్రారంభించాడు. దీని వల్ల అతను చాలా లాభాలు పొందాడు. రాజేష్ మాట్లాడుతూ "నేను తాజా గులాబీలు అమ్మడం ద్వారా రోజుకు రూ. 300 సంపాదించేవాడిని. దీని వలన నా ప్రతినెల ఆదాయం రూ. 9 వేలకి పెరిగింది, ఇది నా మొదటి ఆదాయం కంటే దాదాపు రెట్టింపు" అని అన్నారు. దీని తరువాత అతను సేంద్రీయ గులాబీలను పండించడం ప్రారంభించాడు. దీని వలన అతని ఆదాయం ఇంకా 10 రెట్లు పెరిగింది.

చేసే వ్యాపారం ఏంటి : ప్రస్తుతం రాజేష్ గులాబీ రేకులతో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇందులో గుల్కండ్, రోజ్ వాటర్, షర్బత్, రోజ్ హెయిర్ ఆయిల్ అలాగే రోజ్ బాత్ స్లోప్స్ ఉన్నాయి. ఆయన తయారుచేసిన గుల్కండ్‌ను లూథియానాలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) గుర్తించింది. రాజేష్ భార్య సునీత, పిల్లలు కూడా అతని వ్యాపారంలో సహాయం చేస్తుంటారు.

అతని ఒక నెల సంపాదన ఎంత: నేడు రాజేష్ తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. అతని బ్రాండ్ పేరు పరేరానా ఫ్లవర్ ఫామ్ కింద వాల్యూ ఆధారిత ఉత్పత్తులను హర్యానా, లూథియానా ఇంకా చండీగఢ్‌లలో విక్రయిస్తున్నారు. అతను ఈ ఉత్పత్తులను అమ్మడం ద్వారా నెలకు 50 వేల రూపాయలు అంటే ఏటా 6 లక్షల రూపాయలు సంపాదిస్తాడు.

గులాబీల పంట: గులాబీ పంట సాగు చేయాలనుకుంటే మొదట ఇందుకు తగిన స్థలం, అలాగే ప్రదేశం ముఖ్యం. మీరు గులాబీ పంటతో వ్యాపారం చేయాలనుకుంటే ఇందుకు ప్రభుత్వ లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకోవచ్చు. అనువైన నెలపై గులాబీ మొక్కలు నాటడం తక్కువ సమయంలో మంచి లాభాలు పొందవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని పువ్వుల కంటే గులాబీ పువ్వుల ధర కాస్త ఎక్కువ ఇంకా గులాబి రేకులతో చాల రకాల ఉత్పత్తులు తయారవుతుంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఒక కేజీ పులా ధర 50 రూపాల నుండి 60 రూపాయల వరకు పలుకుతుంది. గులాబీ పూలను ప్రతోరోజు మార్కెట్లో మీరే స్వయంగా విక్రయించడం లేదా సప్లయ్ చేయడం ద్వారా అన్ని అదనపు ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఇంకా పండగ సీజన్ టైంలో ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల అధిక రేటు కూడా పలుకుతుంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+